ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,015 వద్ద గరిష్ఠ స్థాయిని తాకింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : మొత్తానికి బంగారం రికార్డులు కొల్లగొడుతుంది. సరికొత్త రికార్డులు నమోదుచేస్తూ ఈ రోజు బంగారం 10 గ్రాములు 24 క్యారట్లు స్వఛ్ఛమైన బంగారం ధర ఏకంగా రూ.1,00,110 కి చేరింది. ఇన్నేళ్ల లో ఇదే మొదటిసారి ఈ రేంజ్ లో బంగారం పెరగడం.
ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,015 వద్ద గరిష్ఠ స్థాయిని తాకింది. ఇప్పుడు ఆ రికార్డును కూడా అధిగమించి పసిడి ధర కొత్త శిఖరాలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు పెరగడం , డాలర్ తో రూపాయి మారకం విలువ లో తేడాలు చోటు చేసుకుంటున్నాయి.ఇప్పుడు రికార్డును కూడా అధిగమించి పసిడి ధర కొత్త శిఖరాలకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య కోల్డ్ వార్స్ జరుగుతున్నాయిన ఇది కూడా బంగారం పై పెట్టుబడులు ఎక్కువ పెట్టడానికి ఇదొక కారణం.
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కారణంగా బంగారం కొనుగోళ్లు పెరిగాయి. అంతేకాకుండా, చాలామంది బంగారాన్ని దీర్ఘకాలిక సురక్షితమైన పెట్టుబడిగా భావించడం కూడా అధిక కొనుగోళ్లకు కారణమైంది.