Nani: సరిపోదా శనివారం నుంచి ఊర మాస్ పోస్టర్

గురువారం మూవీయూనిట్ ఈ సినిమాకు సంబంధించి కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.


Published Aug 01, 2024 08:33:12 AM
postImages/2024-08-01/1722519160_nani.PNG

న్యూస్ లైన్ సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నాని న‌టిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సరిపోదా శనివారం’. నాని 31గా వస్తున్న ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వ‌హిస్తుండగా నాని సరసన కోలీవుడ్ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‍గా న‌టిస్తోంది. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ మూవీ ఆగ‌ష్టు 29న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే మూవీ నుంచి విడుద‌ల చేసిన గ్లింప్స్‌ ప్రేక్షకుల నుంచి మంచి టాక్ తెచ్చుకుంది. గురువారం మూవీయూనిట్ ఈ సినిమాకు సంబంధించి కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.

ఊర మాస్‌గా ఉన్న ఈ నయా పోస్టర్‌ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ పోస్టర్‌‌లో హరో నాని కత్తి పట్టుకుని గుబురు జట్టుతో కనిపిస్తున్నాడు. యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ సినిమాలో సాయికుమార్, ఎస్‌జే సూర్య  కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నాడు. ఇక‌ ‘అంటే సుందరానికి’ సినిమా తర్వాత నాని – వివేక్ కాంబో రిపీట్ అవుతుండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

newsline-whatsapp-channel
Tags : tollywood movie-news nani cinema-news saripada-shanivaram

Related Articles