Nani Hit: నాని హిట్ 3 నుంచి నయా పోస్టర్ 

‘హిట్ 3’ సినిమాలో నటించనున్నాడు. నాని సమర్పణలో ప్రశాంతి తిపిరనేని నిర్మాణంలో ఇప్పటివరకు రెండు ‘హిట్’ సినిమాలు వచ్చాయి.


Published Sep 05, 2024 12:59:39 AM
postImages/2024-09-05/1725515892_hitmovie.PNG

న్యూస్ లైన్ సినిమా: న్యాచురల్ స్టార్ హీరో నాని ఇటీవల నటించిన “సరిపోదా శనివారం” సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా అమెరికాలో మంచి కలెక్షన్లు సాధించింది. అక్కడ ఈ మూవీ నాని కెరీర్లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం నాని తన తదుపరి సినిమాపై ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలోనే ‘హిట్ 3’ సినిమాలో నటించనున్నాడు. నాని సమర్పణలో ప్రశాంతి తిపిరనేని నిర్మాణంలో ఇప్పటివరకు రెండు ‘హిట్’ సినిమాలు వచ్చాయి. శైలేష్ కొలన్ డైరెక్ట్ చేసిన ‘హిట్’ మొదటి భాగంలో విశ్వక్ సేన్ హీరోగా నటించాడు. ఇక రెండో భాగం ‘హిట్ 2’లో అడవి శేష్ హీరోగా నిటించాడు. ఆ సినిమాలోనే చివర్లో నాని అతిథి పాత్రలో కనిపించాడు. గురువారం ఈ సినిమా నుంచి మేకర్స్ ఇంట్రస్టింగ్ అప్‌డేట్ అభిమానులకు అందించారు. 

ఈ సినిమా పోస్టర్‌ను మూవీయూనిట్ సోషల్ మీడియా వేదికగా గురువారం విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో హీరో నాని పవర్ ఫూల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. నేరాలను ఛేదించే పోలీస్‌గా నాని నటిస్తాడు. ‘హిట్ 3’ సినిమా షూటింగ్ ఈ నెలలోనే మొదలవుతుంది. వచ్చే ఏడాది మార్చిలో సినిమా రిలీజ్ కానుంది. ఇక నాని ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ఒక సినిమా ప్రకటించాడు. కానీ ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులకు చాలా టైం పట్టనుంది. దీంతో నాని ఆ సినిమా షూటింగ్ ని వచ్చే ఏడాదికి షిఫ్ట్ చేశారు.

Related Articles