Nikhil: కార్తీకేయ 2 నేషనల్ అవార్డ్ పై నిఖిల్‌ ఆనందం చూడండి !

తెలుగు లో నిఖిల్ హీరోగా వచ్చిన  కార్తీకేయ2 సినిమాఏ రేంజ్ హిట్టు కొట్టిందో అందరికి తెలిసింది. అన్ని బాషల్లోను సినిమా సూపర్ డూపర్ హిట్టు. 


Published Aug 16, 2024 08:59:38 AM
postImages/2024-08-16/1723806651_1081712nikhilsiddartha.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్; రీసెంట్ గా 70 వ జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించారు. 2022 డిసెంబర్ 31 వరకు సెన్సార్ అయిన సినిమాలలో బెస్ట్ చిత్రాలకు అవార్డులు ప్రకటించారు. ఇందులో భాగంగా మన కార్తీకేయ 2 సినిమా అవార్డు గెలుచుకుంది. తెలుగు లో నిఖిల్ హీరోగా వచ్చిన  కార్తీకేయ2 సినిమాఏ రేంజ్ హిట్టు కొట్టిందో అందరికి తెలిసింది. అన్ని బాషల్లోను సినిమా సూపర్ డూపర్ హిట్టు. 


సినిమా తెలుగులో నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన కార్తికేయ 2 సినిమా పాన్ ఇండియా వైడ్ భారీ విజయం సాధించి ఆల్మోస్ట్ 130 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమా కు అవార్డు వచ్చినందుకు హీరో నిఖిల్ తన హ్యాపీ ఫీలింగ్ ను సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. తన సినిమాకు అవార్డు రావడం చాలా హ్యాపీ గా ఉందని ఇదంతా కృష్ణుడు దయ అని తన ప్రొడ్యూసర్స్ కు థాంక్యూ చెప్పారు.


అన్ని బాషల్లో హిట్టు టాక్ రావడం అంటే అంత చిన్న మాటలేం కాదని ...దర్శకుడి తెలివి...టెక్నీషన్స్ ...క్రూ ఎన్నో వందల మంది కష్టం ఈ రోజు సినిమా సక్సస్ అని అన్నారు.ఈ సినిమా డివోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కించగా ఇందులోని కృష్ణతత్వం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది.

 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nikhil karthikeya-2 national-film-awards

Related Articles