ప్రస్తుత కాలంలో సినిమా ఇండస్ట్రీల్లో భార్యాభర్తల బంధం అనేది చాలా చులకన అయిపోతుంది. పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్న తర్వాత మళ్ళీ విడిపోయి మరో పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి అనేది వారి దృష్టిలో సింపుల్
న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో సినిమా ఇండస్ట్రీల్లో భార్యాభర్తల బంధం అనేది చాలా చులకన అయిపోతుంది. పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్న తర్వాత మళ్ళీ విడిపోయి మరో పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి అనేది వారి దృష్టిలో సింపుల్ అయిపోయింది. ప్రాచ్యాత్య సంస్కృతిని మన ఇండియాలో కూడా పాటిస్తున్నారు. ఈ సంస్కృతి ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా కొనసాగుతోంది. అలాంటి ఈ పరిస్థితులు ఉన్న తరుణంలో సినిమా ఇండస్ట్రీలోని ఒక స్టార్ హీరోకు తన భార్య మాస్ వార్నింగ్ ఇచ్చిందట.
ఒకవేళ ఏదైనా సమస్య వచ్చి నేను చనిపోతే నువ్వు కూడా పాయిజన్ తీసుకొని చనిపో కానీ రెండో పెళ్లి చేసుకోకు అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చిందట. విషయాన్ని ఆవిడే ఒక ఇంటర్వ్యూలో చెప్పడంతో అది కాస్త వైరల్ అవుతుంది. ఆ వివరాలు ఏంటో చూద్దామా.. బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో అక్షయ్ కుమార్ అంటే తెలియని వారు ఉండరు. మంచి రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి అక్షయ్ కుమార్ ఇండస్ట్రీలో రవినా తండన్, శిల్పా శెట్టితో డేటింగ్ చేశాడని అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి. కానీ చివరికి ఇందులో నిజం లేదని తెలిసింది.
అలాంటి ఈయన ట్వింకిల్ కన్నాను వివాహం చేసుకున్నాడు. ఇక ఈమెని ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నాడో అప్పటినుంచి ఆయన ఎలాంటి డేటింగ్ వంటి పాలసీలు పాటించడం లేదట. వీరిద్దరూ చాలా హ్యాపీగా జీవిస్తారట ఏదైనా క్లియర్ గా చెప్పుకుంటారట. ట్వింకిల్ కన్నా పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. తన ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఒక ఆథర్ గా మారిపోయింది.
ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు. అలాంటి ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వారి పెళ్లి తర్వాత వారి మధ్య జరిగిన ఒక సంఘటన గురించి చెప్పింది. నేను నా భర్త ఇలా చెప్పాను అన్నది. " నేను చనిపోతే వెంటనే పాయిజన్ తీసుకొని నువ్వు కూడా చనిపో, కానీ మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆలోచన చేయొద్దు అంటూ వార్నింగ్ ఇచ్చా అని చెప్పింది. ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నువ్వు చెప్పింది కరెక్ట్, నీ భర్త నువ్వు కంట్రోల్ లో ఉంచుకోవడం నీ ధర్మం అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.