Marriage:పెళ్లికి ముందే సహజీవనం చేస్తున్న హీరోయిన్స్..!

సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. అంతా మోడ్రన్ లైఫ్ కు అలవాటు పడి  ఇండియాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పెళ్లి తంతును కూడా విస్మరిస్తున్నారు. చివరికి పెళ్లి చేసుకున్న వారు కూడా ఇష్ట 


Published Aug 09, 2024 08:31:10 AM
postImages/2024-08-09/1723172470_seria.jpg

న్యూస్ లైన్ డెస్క్: సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. అంతా మోడ్రన్ లైఫ్ కు అలవాటు పడి  ఇండియాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పెళ్లి తంతును కూడా విస్మరిస్తున్నారు. చివరికి పెళ్లి చేసుకున్న వారు కూడా ఇష్ట ప్రకారమే కలిసి ఉన్నన్ని రోజులు ఉండి ఆ తర్వాత విడిపోతున్నారు. ఇంకా కొంతమంది అయితే పెళ్లి కాకుండానే ఇతర పురుషులతో సహజీవనం చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెళ్లి కాకుండా ఇతర వ్యక్తులతో కలిసి ఉండి సహజీవనం చేస్తున్న కొంతమంది యాక్టర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కేవలం వెండితెర పైనే కాకుండా బుల్లితెరపై కూడా ఎంతో అందమైన హీరోయిన్స్ ఉన్నారు. వీరు కూడా పెళ్లి కాకుండానే వారి కో స్టార్లతో సహజీవనం చేస్తున్నారట. వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది..

 కీర్తి బట్ కార్తీక్ తోట:
కార్తీకదీపం సీరియల్ అంటే తెలియని వారు ఉండరు.ఈ సీరియల్లో నటించే నటీనటులంతా ఎంతో ఫేమస్. అందులో కీర్తి కూడా ఒకరు. ఈమె ఇదే క్రేజ్ తో బిగ్ బాస్ 6లో కూడా ఎంట్రీ ఇచ్చి అందరిని ఆకట్టుకుంది. అయితే ఈమె ఇటీవల కార్తీక్ తోట అనే వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేసుకుంది.  కానీ ఈమె ఎంగేజ్మెంట్ కు ముందే ఆయనతో సహజీవనం చేస్తూ వస్తుందట. 

 ప్రియాంక జైన్ శివకుమార్ :
 జానకి కలగనలేదు అనే సీరియల్ లో ఇన్నోసెంట్ పాత్ర అంటే  ప్రియాంక జైన్ మాత్రమే గుర్తుకొస్తుంది. ఈమె బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో అందరిని అలరించింది.  అలాంటి ఈ ముద్దుగుమ్మ తన కోనటుడు శివకుమార్ తో డేటింగ్ లో ఉందని అప్పట్లోనే ప్రకటించింది. మౌనరాగం సీరియల్ ద్వారా పరిచయమైనటువంటి వీరి స్నేహం, ప్రేమగా మారి పెళ్లికి ముందే సహజీవనం చేసే పరిస్థితికి చేరుకుంది. త్వరలో వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు సమాచారం. 

 సిరి హనుమంతు శ్రీహాన్:
 సావిత్రమ్మ గారి అబ్బాయి అనే సీరియల్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి నటి సిరి హనుమంతు. ఈమె బిగ్ బాస్  సీజన్ 6లో రన్నరఫ్ గా నిలిచినటువంటి శ్రీహాన్ తో చాలాకాలంగా లవ్ లో ఉందట. వీరు పెళ్లికి ముందే సహజీవనం చేస్తున్నారు అంతే కాదు ఒక బాబును దత్తత తీసుకొని పెంచుకుంటున్నారు కూడా. 

 శోభాశెట్టి యశ్వంత్:
కార్తీకదీపం సీరియల్ వీక్షించే వారికి మౌనిత అంటే తెలియని వారు ఉండరు. ఇందులో విలన్ పాత్ర తన కోసమే పెట్టినట్టు ఉంటుంది. ఈమె కూడా బిగ్ బాస్ సీజన్ 7లో ఎంట్రీ ఇచ్చి అద్భుతంగా ఆకట్టుకుంది. ఈ మధ్యకాలంలోనే ఈమెకు యశ్వంత్ తో ఎంగేజ్మెంట్ జరిగింది.  కానీ పెళ్లి ఇప్పుడే చేసుకోరట కొత్త ఇల్లు కొనుక్కొని అందులోకి వెళ్లి కొన్నాళ్లపాటు సహజీవనం చేసి  పెళ్లి చేసుకుంటారట.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu karthika-deepam priyanka-jain sobha-shetty siri-hanmanthu kirthi-bhatt

Related Articles