పక్కనే ఇతర నాయకులు.. ఎదురుగా వందలాది మంది కార్యకర్తలు ఉన్నా.. ఒక కార్యక్రమంలో ఉన్నామన్న జ్ణానం లేకుండా బహిరంగంగా హుక్కా పీలుస్తూ మత్తులో జోగుతున్నాడు.
న్యూస్ లైన్ డెస్క్: ఎవరేమనుకుంటారో అన్న ఇంగితం కాంగ్రెస్ నాయకులకు ఉండదనే విషయం మరోసారి రుజువైంది. పార్టీ కార్యాలయంలోనే విచక్షణ కోల్పోయి ప్రవర్తించిన ఓ కాంగ్రెస్ నేతకు సంబంధించిన వీడియో ఒకటి లీక్ ఐంది. ఆయన చుట్టూ వందల మంది కార్యకర్తలు ఉన్నారనే ఇంగితం కూడా లేకుండా దర్జాగా కూర్చొని హుక్కా సేవించాడు.
యూపీలోని సహ్రాన్‌పూర్ లోక్‌సభ ఎంపీగా ఉన్న ఇమ్రాన్ మసూద్.. పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో బహిరంగంగానే మత్తుగా, హుక్కా తాగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పక్కనే ఇతర నాయకులు.. ఎదురుగా వందలాది మంది కార్యకర్తలు ఉన్నా.. ఒక కార్యక్రమంలో ఉన్నామన్న జ్ణానం లేకుండా బహిరంగంగా హుక్కా పీలుస్తూ మత్తులో జోగుతున్నాడు.
ఇమ్రాన్ మసూద్ తీరును చూసి ఇలాంటి వ్యక్తినా మనం ఓట్లేసి గెలిపించుకొని పార్లమెంట్‌కి పంపింది అని సహ్రాన్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం స్పందించి అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పార్టీకి ఉన్న కొంత పరువును కూడా గంగలో కలుపుతున్న ఇటువంటి నేతలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
మత్తులో తూగుతున్న కాంగ్రెస్ ఎంపీ
పార్టీ కార్యాలయంలోనే హుక్కా తగిన ఎంపీ
యూపీలోని సహ్రాన్‌పూర్ లోక్‌సభ.. కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ వీడియో లీక్
కార్యకర్తల ముందే పార్టీ ఆఫీసులు హుక్కా తగిన ఇమ్రాన్ మసూద్ pic.twitter.com/4CrQ0GhmzK — News Line Telugu (@NewsLineTelugu) August 29, 2024