Wine Shop: హైదరాబాద్‌లో వైన్స్ బంద్

హైదరాబాద్‌ నగరంలో వైన్స్ బంద్ అవుతుంది.


Published Jul 26, 2024 10:49:05 AM
postImages/2024-07-26/1722008925_wines.PNG

న్యూస్ లైన్ డెస్క్: హైదరాబాద్‌ నగరంలో వైన్స్ బంద్ అవుతుంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఈస్ట్ జోన్, సౌత్ జోన్‌లో బోనాల పండుగ సందర్భంగా ఈ నెల 28 ఉదయం 6 గంటల నుండి 29 ఉదయం 6 గంటల వరకు వైన్స్ బంద్ ఉంటుంది. అలాగే హైదరాబాద్ కోర్ సిటీ సౌత్ జోన్‌లో ఈ నెల 28 ఉదయం 6 గంటల నుండి 30 ఉదయం 6 గంటల వరకు వైన్స్ బంద్ ఉంటుంది. దాంతో మద్యం ప్రియులు వైన్ షాప్‌కు ఎగబడ్డారు. 

ఆశాఢ మాసంలో హైదరాబాద్‌లో బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయన్నాయి. భక్తి శ్రద్ధలతో అమ్మ వార్లకు బోనాలు సమర్పించి కొలుస్తుంటారు. మహంకాళీ బోనాల పండుగ నేఫథ్యంలో  స్టార్‌ హోటల్స్‌, పబ్బులు, క్లబ్బుల్లో కూడా మద్యం సరఫరాను నిలిపివేస్తున్నట్లు సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు  హైదరాబాద్ సీపీ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఎవరైనా మద్యం షాపులు తెరవాలని చూసినా.. తెరిచినా కఠిన చర్యలు ఉంటాయి అని సీపీ తెలిపారు.

newsline-whatsapp-channel
Tags : telangana hyderabad police bonalu-festival

Related Articles