Lavanya:రాజ్ తరుణ్ గురించి నిజాలు బయటపెడితే మొహం మీద 'తూ' అని ఊంచుతారు.!

రాజ్ తరుణ్ తాజాగా తన సినిమా తిరగబడరా సామి చిత్ర యూనిట్ తో కలిసి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో  పాల్గొన్నారు.  ఇక ఈ ఈవెంట్లో రాజ్ తరుణ్,లావణ్య వివాదం గురించి క్లారిటీ ఇస్తూ ఈ విషయం లో


Published Jul 31, 2024 11:16:48 AM
postImages/2024-07-31/1722441243_tarunraj.jpg

న్యూస్ లైన్ డెస్క్: రాజ్ తరుణ్ తాజాగా తన సినిమా తిరగబడరా సామి చిత్ర యూనిట్ తో కలిసి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో  పాల్గొన్నారు.  ఇక ఈ ఈవెంట్లో రాజ్ తరుణ్,లావణ్య వివాదం గురించి క్లారిటీ ఇస్తూ ఈ విషయం లో లీగల్ గా ప్రొసీడ్ అవుతానని,ఈ ఇష్యుపై ఇంకా ప్రశ్నలు వేసి విసిగించ వద్దని,నా దగ్గర అన్నింటికి ఆధారాలు ఉన్నాయని,  అలాగే ఈ వివాదం కారణంగా నేను చాలా ఎఫెక్ట్ అయ్యాను అంటూ చెప్పుకోచ్చారు.

అయితే ప్రసాద్ ల్యాబ్ లో తిరగబడరా సామి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుదింఅని తెలుసుకున్న లావణ్య వెంటనే అక్కడికి వచ్చి రచ్చ రచ్చ చేసింది.నన్ను లోపలికి పోనివ్వండి నా భర్తతో నేను మాట్లాడాలి.. రాజ్ తరుణ్ తో మాల్వి మల్హోత్రా ఎందుకు తిరుగుతుంది.. రాత్రింబవళ్లు భార్య భర్తల్లాగా ఎందుకు కలిసి ఉంటున్నారు. వారిద్దరి మధ్య ఉన్న విషయం బయటపడాలి. నన్ను లోపలికి వెళ్ళనివ్వండి.రాజ్ తరుణ్ తో మాట్లాడాలి .ఫోన్ స్విచ్చాఫ్ చేసుకుని తప్పించుకొని తిరుగుతున్నాడు.

ఎలాంటి తప్పు చేయనివాడు ఎందుకు భయపడి ఫోన్ స్విచ్చాఫ్ చేసుకుని కనిపించకుండా తిరుగుతున్నాడు.. మాల్వి సినిమా కోసమే వస్తే రాజ్ తరుణ్ తో సంసారం చేస్తున్నట్టు ఎందుకు ఉంటుంది.వాళ్ళిద్దరూ పగలు, రాత్రి ఎక్కడ గడుపుతున్నారో నాకు తెలుసు.. నేను ఇప్పటి వరకు రాజ్ తరుణ్ గురించి కొన్ని విషయాలే చెప్పాను.అతనికి సంబంధించిన నిజాలు ఇంకా ఉన్నాయి.ఆ విషయాలన్నీ ఇప్పుడు బయట పెడితే గనుక ఆయన మొహం మీద తూ అని ఊంచుతారు..అంటూ మీడియాతో చెప్పుకొచ్చింది లావణ్య. ఇక లావణ్యని పోలీసులు ప్రసాద్ ల్యాబ్ లోకి వెళ్ళనివ్వకపోవడంతో అక్కడే ఉండి నిరసన వ్యక్తం చేసింది.

newsline-whatsapp-channel
Tags : news-line criminal-case rajtarun lavanya malvi-malhotra pregnant

Related Articles