Astrology:సెప్టెంబర్ లో ఈ 3 రాశుల వారు ఇలా చేస్తే కోటీశ్వరులే..ఇందులో మీరున్నారా.?

సాధారణంగా మన ఇండియా ప్రజలంతా జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముతూ ఉంటారు. ఈ శాస్త్రం ప్రకారం  బుధ గ్రహానికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంది.  ఈ గ్రహాన్ని తెలివితేటలకు, స్నేహానికి కారకంగా


Published Aug 28, 2024 06:52:20 AM
postImages/2024-08-28/1724808140_rashulu.jpg

న్యూస్ లైన్ డెస్క్: సాధారణంగా మన ఇండియా ప్రజలంతా జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముతూ ఉంటారు. ఈ శాస్త్రం ప్రకారం  బుధ గ్రహానికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంది.  ఈ గ్రహాన్ని తెలివితేటలకు, స్నేహానికి కారకంగా చెబుతారు. ముఖ్యంగా సెప్టెంబర్ బుధుడు సూర్యుడి రాశి అయిన సింహరాశిలోకి వస్తున్నాడు. దీనివల్ల ఈ నాలుగు రాశుల వారికి అద్భుతమైన అదృష్టం పట్టి ధనవంతులవుతారట. ముఖ్యంగా బుధుడు జాతకం ప్రకారం శుభస్థానంలో ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. అశుభ స్థానంలో ఉంటే అశుభ ఫలితాలు వస్తాయి. కానీ ఈసారి బుధుడు శుభస్థానంలో ప్రవేశం వల్ల ఈ రాశుల వారికి తెగ అదృష్టం రాబోతుందని అంటున్నారు. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు చూద్దాం..

#1. మేషరాశి:
బుధుడు గ్రహ సంచారం వలన మేషరాశి జాతకులకు అనేక శుభ ఫలితాలు వస్తాయట. వీరి యొక్క ఆదాయం కూడా పెరుగుతుందని తల్లిదండ్రుల నుంచి సంపద కూడా వస్తుందని  అంటున్నారు. ఈ టైంలో మేషరాశి జాతకులకు సంగీతం, కలలు పట్ల ఆసక్తి పెరుగుతుందట.  ముఖ్యంగా సంతానం లేని వారు సంతానం పొంది ఆనందంగా జీవిస్తారట. చదువుకున్న వారికి ఉద్యోగాలు, చేస్తున్న వారికి ప్రమోషన్లు వస్తాయట. మొత్తానికి ఈ రాశి వారికి అన్ని శుభ ఫలితాలే ఉంటాయని అంటున్నారు. 

#2. మిధున రాశి:
ఈ రాశి వారు  బుధగ్రహ సంచారం వలన ఈ రాశి వారికి అన్ని శుభ ఫలితాలే ఉంటాయట. తల్లిదండ్రుల నుంచి అనేక ఆస్తులు పొందుతారు. అంతేకాదు ఆదాయాన్ని వీరు రెట్టింపు కూడా చేసుకుంటారు. వ్యాపారస్తులు అయితే అనేక లాభాలు వస్తాయట. కుటుంబ సమస్యలు కూడా తొలగిపోయి ఆనందంగా జీవిస్తారట. 

#3.  సింహరాశి:
బుధ గ్రహ సంచారం వలన  సింహరాశి వారికి బాగా కలిసి వస్తుందట. ఈ రాశి వారు ఉద్యోగ, వ్యాపార రంగాలలో చాలా పురోగతి సాధిస్తారని, ఈ రాశి వారికి అధికారుల యొక్క సహకారం లభిస్తుందని, ఆదాయ వనరులు పెరుగుతాయని అంటున్నారు. ముఖ్యంగా స్థానాల్లో మార్పు జరిగే అవకాశం ఉంటుందని వారు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా బుధుడు  సింహరాశి లోకి వెళ్లడం వల్ల ఈ మూడు రాశుల   వారు అద్భుతంగా ధనవంతులవుతారని జ్యోతిష్య పండితులు అంటున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu astrology rashi happy-life mesha-rashi money mithuna-rashi

Related Articles