ఎంతో బిజీ లైఫ్ ఉన్నా కానీ మీ భాగస్వామితో కనీసం రాత్రి పడక గదిలో ఆయన కాసేపు మాట్లాడండి. లైఫ్ కు సంబంధించిన విషయాలు షేర్ చేసుకోండి. అలా లైంగికంగా కాసేపు ఆనందించండి. ముఖ్యంగా భర్తలు భార్య
న్యూస్ లైన్ డెస్క్: పూర్వకాలంలో ఒక్కసారి పెళ్లి చేసుకుంటే 100 సంవత్సరాల వరకు భర్తే ధ్యాసగా, బార్యే ప్రాణంగా బ్రతికేవారు. పదిమంది పిల్లలను కన్నా కానీ వారి మధ్య సాన్నిహిత్యం అనేది తగ్గేది కాదు. కానీ ప్రస్తుత కాలంలో జంటల మధ్య ఆ పరిస్థితులు కనిపించడం లేదు. డబ్బు సంపాదించాలనే ధ్యాసలో పడి సంసార సుఖాన్ని నెగ్నేట్ చేస్తున్నారు. దీనివల్ల ఆ భార్యాభర్తలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా భార్యాభర్తలు కొత్తగా పెళ్లయిన సమయంలోనే బాగా కలిసి ఉండి పిల్లలు పుట్టిన తర్వాత విడివిడిగా ఉండడం కనీసం కలవకపోవడం వంటివి చేస్తూ వారి జీవితాన్ని వారే ఇబ్బందుల పాలు చేసుకుంటున్నారు. ఇలా పడకగదిలో ఇద్దరు సాన్నిహిత్యంగా లేకుంటే ఏర్పడే అనర్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
#1. విసుగు రావడం:
ముఖ్యంగా భార్యాభర్తలిద్దరూ పడక గదిలో సన్నిహిత్యంగా నిద్రించకపోతే ఒకరిపై ఒకరికి విసుగు అనేది పుడుతుంది. మీ భార్య లేదా భర్త మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు సరైన భావోద్వేగాన్ని పొందలేరు. ఎవరు ఎవరిని తాకిన కోపమే వస్తుంది.
#2. లైంగిక శక్తి తగ్గడం:
ముఖ్యంగా భార్యాభర్తలు వేరువేరుగా నిద్రించడం వల్ల మీ మధ్య ఉన్నటువంటి లైంగిక అనుబంధం దెబ్బతింటుంది. దీని వల్ల ఒకరిపై ఒకరికి ప్రేమ కూడా తగ్గుతుందట.
#3.మరొకరిపై ప్రేమ:
మీ మధ్య సాన్నిహిత్యం తగ్గితే మనసు మరొకరిని కోరుకుంటుందట. ఇదే సమయంలో భర్త లేదా భార్య వేరొకరిపై ప్రేమలో పడే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో కనీసం మీ దగ్గరికి వచ్చి కూర్చుని మాట్లాడడానికి కూడా ఇష్టపడరు.
#4.సాన్నిహిత్యం తగ్గడం:
ప్రస్తుత బిజీ లైఫ్ లో భార్యాభర్తలిద్దరూ కాసేపు మాట్లాడుకోవడానికి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి కేవలం పడుకునే సమయం ఒక్కటే. ఈ సమయాన్ని కూడా నెగ్లెట్ చేస్తే మాత్రం మీ మధ్య బంధం అనేది దారుణంగా చెడిపోతుంది.
#5.ఏం చేయాలంటే:
ఎంతో బిజీ లైఫ్ ఉన్నా కానీ మీ భాగస్వామితో కనీసం రాత్రి పడక గదిలో ఆయన కాసేపు మాట్లాడండి. లైఫ్ కు సంబంధించిన విషయాలు షేర్ చేసుకోండి. అలా లైంగికంగా కాసేపు ఆనందించండి. ముఖ్యంగా భర్తలు భార్య యొక్క కోరికలు ఏంటో తెలుసుకొని అవి తీర్చడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని విశ్వసించి మీ చేయి పట్టుకున్న వ్యక్తి కాబట్టి వారిని గట్టిగా పట్టుకొని ఆలింగనం చేసుకోండి. దీనివల్ల మీ భాగస్వామి మనసులో ఏమున్నా మీతో షేర్ చేసుకుంటుంది. దీంతో మీమధ్య బంధం అనేది బలపడుతుందని నిపుణులు అంటున్నారు.