IMD: రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్..మే 27 కి కేరళకి చేరుకుంటాయంటున్న IMD !

రుతుపవనాల ముందస్తు ఆగమనం ఖరీఫ్ పంటల సాగు పనులను త్వరగా ప్రారంభించేందుకు రైతులకు ఎంతగానో ఉపకరిస్తుంది


Published May 10, 2025 08:54:00 PM
postImages/2025-05-10/1746890755_keralarainnew.avif

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : దేశ ప్రజలు , ముఖ్యంగా రైతులు చూస్తున్న నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది కేరళ తీరాన్ని కాస్త ముందుగానే పలకరించనున్నాయి. సాధారణంగా జూన్ 1న ప్రవేశించే రుతుపవనాలు , ఈ సారి మే 27 వ తేదీనే కేరళను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. ఈ యేడాది కంటే ఐదురోజుల ముందే మొదలవుతున్నాయి.


రుతుపవనాల ముందస్తు ఆగమనం ఖరీఫ్ పంటల సాగు పనులను త్వరగా ప్రారంభించేందుకు రైతులకు ఎంతగానో ఉపకరిస్తుంది. ఈ అంచనాతో రైతులు వ్యవసాయ పనులకు సన్నధ్ధం కావడానికి వీలు కలుగుతుంది. భారత ప్రధాన భూభాగంలోకి రుతుపవనాల ప్రవేశానికి కేరళ ఆరంభమే ఒక ముఖ్యమైన సూచికగా పరిగణిస్తారు. వేడి, పొడి వాతావరణం నుంచి వర్షాకాలంలోకి మారడాన్ని ఇది సూచిస్తుంది. 


ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మే 27 న కేరళలో ప్రవేశించే అవకాశం ఉంది. మా నమూనా అంచనాలో అటూ ఇటూగా 4 రోజుల వ్యత్యాసం ఉండవచ్చు అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కేరళలో రుతుపవనాల ప్రవేవ తేదీని అంచనా వేయడానికి ఐఎండీ ఆరు రకాల సూచికలను ఉపయోగిస్తుంది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1న కేరళలో ప్రవేశించి , సుమారు ఏడు రోజుల ప్రామాణిక వ్యత్యాసంతో జూలై 8 నాటికి దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందుతాయని తెలిపారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 'సాధారణం కంటే ఎక్కువ' వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ గత నెలలోనే అంచనా వేసిన విషయం తెలిసిందే. ఇది రైతులకు మరింత ఊరటనిచ్చే అంశం.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu rains india kerala

Related Articles