Operation Sindoor: పాకిస్థాన్ మిస్సైల్స్ ను కూల్చేసిన భారత్ ..వైరల్ వీడియో !

పాకిస్థాన్ డ్రోన్లు , మిస్సైల్స్ శకలాలు చెల్లాచెదురుగా పడ్డ వీడియోలు ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


Published May 19, 2025 10:59:00 AM
postImages/2025-05-19/1747632823_393488pak1.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : పహల్గామ్ ఉగ్రదాడికి  ప్రతీకారం గా సింధూర్ పేరుతో భారత ఆర్మీ పాక్ లోని ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ మెరుపు దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. దీంతో పాక్ ఉగ్రవాదులు రగిలిపోతున్నారు. భారత్ ఆర్మీ సదుపాయాలు , జనవాసాలే లక్ష్యంగా దాడులకు పాల్పడింది. వందలాది పాక్ డ్రోన్స్ మిస్సెల్స్ ను భారత్ ప్రయోగించింది. దీంతో ఎస్ 400, ఆకాశ్ వంటి మన గగనతల రక్షణ వ్యవస్థలు అద్భుత రీతిలో వాటిని నేలమట్టం చేశాయి. వాటిని ఎక్కడిక్కడ కూల్చిపడేశాయి. పాకిస్థాన్ డ్రోన్లు , మిస్సైల్స్ శకలాలు చెల్లాచెదురుగా పడ్డ వీడియోలు ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


మన డిఫెన్స్ వ్యవస్థలు అడ్డుగోడలా వాటిని అడ్డుకున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ పై జరిపిన పలు దాడుల వీడియోలను భారత ఆర్మీ విడుదల చేసింది. రీసెంట్ గా పాకిస్థాన్ మిస్సైల్స్ ను ఎలా కూల్చారో తెలిపే విధంగా వెస్ట్రన్ కమాండ్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. అగ్ని గోడలా భారత్ ఆర్మీ శత్రుదేశపు మిస్సైళ్లను కూల్చిందని పేర్కొంది.
 

newsline-whatsapp-channel
Tags : blast pakistan indian-soldier videos indian-army

Related Articles