అయినా వెబ్ సీరిస్ లతో సూపర్ ఫామ్ లో ఉంది. తాజాగా సమంతకు ఓటీటీలో ఉత్తమ నటి అవార్డు లభించింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : సౌత్ లో సమంతకు పరిచయాలు అవసరం లేదు. ఇప్పుడు సిటాడెల్ తర్వాత బాలీవుడ్ లో ను అమ్మడు అందరికి పరిచయమే. అయితే హిందీ, తమిళం వంటి బాషల్లో సూపర్ డూపర్ హిట్స్ కొట్టి ..టాప్ హీరోయిన్ గా రచ్చ లేపింది. డివోర్స్ తర్వాత హెల్త్ ఇష్యూస్ కారణంగా సినిమాలు చెయ్యడం తగ్గించింది. అయినా వెబ్ సీరిస్ లతో సూపర్ ఫామ్ లో ఉంది. తాజాగా సమంతకు ఓటీటీలో ఉత్తమ నటి అవార్డు లభించింది.
'హనీ-బన్నీ' సిరీస్‌లో అద్భుతమైన నటన కనబరిచినందుకు ఒక ప్రముఖ మీడియా సంస్థ ఆమెను ఈ పురస్కారంతో సత్కరించింది. ఈ అవార్డు రావడంతో సమంత చాలా సంతోషం వ్యక్తం చేసింది. ‘హనీ-బన్నీ’ సిరీస్‌ను పూర్తి చేయడమే తనకు ఒక అవార్డు అని సమంత పేర్కొంది.
రాజ్ అండ్ డీకే , వరుణ్ దావన్ ల వల్ల తాను సిటాడెల్ హనీ బన్నీ కంప్లీట్ చేసిందని సమంత చెప్పింది. సీరిస్ చేస్తున్నపుడు కూడా చాలా సార్లు సమంతకు హెల్త్ బాలేదు. ఎన్నో కష్టాలు ఓర్చుకొని చేసినందుకు ఈ అవార్డు చాలా సంతృప్తిని ఇచ్చిందన్నారు సమంత.