ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రణయ్ భార్య అమృతకు చెకప్ చేయించి తిరిగి వస్తున్న టైంలో ప్రణయ్ ను దుండగులు హత్య చేశారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : పెరుమాళ్ల ప్రణయ్ ...అమృతప్రణయ్ గా చాలా మందికి పరిచయం . 2018 లో జరిగిన పరువు హత్య . ఈ కేసులో నల్గొండ కోర్పు ఈ రోజు తుది తీర్పును ఇచ్చింది. ఈ కేసుకు సంబంధం ఉన్నఎనిమిది మందిలో ఏ 1 మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో ఏ2 గా ఉన్న సుభాశ్ శర్మకు కోర్టు ఉరిశిక్ష విధించింది. మిగిలిన దోషులకు ఆరుగురికి కోర్టు జీవిత ఖైదు విధించింది. 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ హత్యకు గురయ్యారు. ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రణయ్ భార్య అమృతకు చెకప్ చేయించి తిరిగి వస్తున్న టైంలో ప్రణయ్ ను దుండగులు హత్య చేశారు.
అమృత , ప్రణయ్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ..తర్వాత ప్రేమ గా మారి ..పెళ్లి చేసుకుందామనుకున్నారు. అమృత ఇంట్లో ఒప్పుకోలేదు. 2018 జనవరి 31న అమృత, ప్రణయ్ హైదరాబాద్ ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. కొంత కాలం తర్వాత మిర్యాలగూడలో పెద్ద రిసప్షన్ కూడా చేసుకున్నారు. ఆ కొద్ది రోజులకే ప్రణయ్ హత్య జరిగింది. ఈ కేసులో ఏ1 గా అమృత తండ్రి తిరునగరు మారుతీరావు, ఏ2 గా బీహార్ కు చెందిన సుభాష్ శర్మ, ఏ3గా అజ్గర్ అలీ, ఏ4గా అబ్దుల్ బారీ, ఏ5 గా ఎం.ఏ కరీం, ఏ6 గా తిరునగరు శ్రవణ్ కుమార్, ఏ7 గా శివ, ఏ8 గా నిజాంను నిందితులుగా చేర్చారు. ఎక్వైంయిరీ చేసిన పోలీసులు పరువు హత్యగా తేల్చారు.
ఆత్మహత్య చేసుకున్న మారుతీరావు ప్రణయ్ హత్య కేసులో ఏ1 గా ఉన్న తిరునగరు మారుతీరావు 2020 మార్చి 7న హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్నారు.హైదరాబాద్ ఖైరతాబాద్ లోని ఆర్యవైశ్యభవన్ లో ఆయన సూసైడ్ చేసుకున్నారు. అమృత అమ్మ వద్దకు వెళ్లు ..అంటూ సూసైడ్ నోట్ రాశారు. గిరిజా క్షమించు అంటూ తన భార్యనుద్దేశించి లెటర్ రాశారు.హైదరాబాద్ లో ప్రముఖ లాయర్ తో మాట్లాడేందుకు వచ్చి ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు.