ఈ నెల 28వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో సిమ్రాన్ ..లైలా రాజీవ్ మీనన్ మెయిన్ లీడ్స్ పోషించారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఆది పినిశెట్టి - లక్ష్మి మీనన్ మెయిన్ లీడ్స్ చేసిన "శబ్ధం" సినిమా ఫిబ్రవరి 28 వ తేదిన థియేటర్లకు వచ్చింది. గతంలో ఆదిపినిశిట్టి నుంచి హారర్ థ్రిల్లర్ గా వచ్చిన " వైశాలి " భారీ విజయాన్ని సాధించడంతో సహజంగానే " శబ్ధం " పై అంచనాలు పెరిగిపోయాయి. కాని సినిమా పెద్దగా వర్కవుట్ కాలేదు. ఈ సినిమా ను ఈ నెల 28వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో సిమ్రాన్ ..లైలా రాజీవ్ మీనన్ మెయిన్ లీడ్స్ పోషించారు.
ఒక కాలేజ్ లో స్టూడెంట్స్ ఒకరి తరువాత ఒకరుగా చనిపోతూ ఉంటారు. అయితే ఏం జరుగుతుందనే విషయంలో నుంచి తేరుకునేలోగా కొంతమంది చనిపోతారు. కాలేజ్ లో ప్రేతాత్మలు తిరుగుతున్నాయనే ప్రచారం జరుగుతుంది. దాంతో కాలేజ్ స్టాఫ్ ..ఆత్మలతో మాట్లాడే శక్తి కలిగిన వైద్యలింగం అనే వ్యక్తిని రంగంలోకి దింపుతారు. అతను ఏం చెబుతున్నాడు ...అనేదే కథ ఈ సినిమా అమేజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతుంది.