తాజాగా ‘వీర ధీర శూర పార్ట్ 2’ ట్రైలర్ రిలీజ్ చేసారు. ట్రైలర్ లో పోలీసులంతా కలిసి ఒకర్ని చంపడానికి రాత్రి పూట జాతరలో కి వస్తారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : తమిళ్ స్టార్ విక్రమ్ హీరోగా రిలీజ్ అవుతున్న సినిమా వీర ధీర శూర పార్ట్ 2 సినిమా మార్చ్ 27 న తమిళ్ , హిందీ, తెలుగులో రిలీజ్ అవుతుంది. HR పిక్చర్స్ రియా శిబు నిర్మాణంలో ఎస్ . యు అరుణ్ కుమార్ డైరక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంద. ఎస్. జె . సూర్య లాంటి వారు మెయిన్ లీడ్స్ లో చేస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ‘వీర ధీర శూర పార్ట్ 2’ ట్రైలర్ రిలీజ్ చేసారు. ట్రైలర్ లో పోలీసులంతా కలిసి ఒకర్ని చంపడానికి రాత్రి పూట జాతరలో కి వస్తారు. కథ అంతా ఒక్క రాత్రిలో జరుగుతున్నట్లు ఉంది. మరి ఎవర్ని చంపాలనుకుంటున్నారు..హీరో నా ..లేక హీరో ఈ ఫైట్ ను చేసి ఎవరినైనా కాపాడతాడా చూడాలి. అయితే ఈ సినిమాకి మొదట పార్ట్ 2 చేస్తున్నారు. ఇది హిట్ అయితే దీనికి ప్రీక్వెల్ పార్ట్ 1 చేస్తారట. ఇది కాస్త డిఫరెంట్ గా ఉంది.