.అసలు చదువుకోకపోయినా ...మినిమమ్ కామన్ సెన్స్ ఉంటుంది కదా..యూట్యూబ్ వీడియో చూసి ఆపరేషన్ చేసుకోవాలనుకున్నాడు ఓ వ్యక్తి.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : సోషల్ మీడియా మనుషులను పిచ్చి వాళ్లను చేస్తుంది.నిజంగా పిచ్చెక్కిస్తుంది . లేకపోతే ఎంత చదువు ఉన్నా ...అసలు చదువుకోకపోయినా ...మినిమమ్ కామన్ సెన్స్ ఉంటుంది కదా..యూట్యూబ్ వీడియో చూసి ఆపరేషన్ చేసుకోవాలనుకున్నాడు ఓ వ్యక్తి. ఈ క్రమంలో పొట్టను కోసి సర్జరీ చేసేందుకు ప్రయత్నించగా విఫలమై తీవ్ర రక్తస్రావమైంది. తనకు తానే ఆపరేషన్ చేసుకోవాలనుకొని అనుకున్నాడు ఓ వ్యక్తి . ఇంతకు విషయం ఏంటంటే.
మథురలోని సున్ రాఖ్ గ్రామానికి చెందిన రాజా బాబు (32) గత కొద్దికాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. 19 ఏళ్ల వయసులో తనకు 24గంటల నొప్పి ఆపరేషన్ జరిగింది. అయినా ఎందుకో ఇంకా కడుపు నొప్పి తగ్గలేదు దీంతో తనే యూట్యూబ్ చూసి ఆపరేషన్ చేసేసుకుందామనుకున్నాడు. ఇందుకోసం సర్జరీ ఎలా చేయాలో యూట్యూబ్లో వీడియోలు చూశాడు. ఆపరేషన్ కోసం మథురకు వెళ్లి సర్జికల్ బ్లేడ్‌లు, కుట్లు వేసుకునే పరికరాలు, మత్తు ఇంజెక్షన్లు తెచ్చుకున్నాడు. అయితే ఫస్ట్ ఇంజక్షన్ చేసుకొని కడుపుని 7 అంగుళాల గాటు పెట్టాడు. అది అనుకున్న దాని కంటే ఎక్కువ గాటు పడి విపరీతమైన రక్తస్రావం కావడంతో వెంటనే కుట్టేద్దామనుకున్నాడు. కాని అప్పటికే మత్తు వదిలేసింది. రక్తస్రావం ఆగడం లేదు...దీంతో వెంటనే బంధువులకు ఫోన్ చేసి హాస్పటిల్ కు తీసుకువెళ్లాలని కోరారు. ప్రస్తుతం రాజాబాబు కోలుకుంటున్నట్లు తెలిపారు బంధువులు.