Naveen: నవీన్ పోలిశెట్టికి కి పెళ్ళై పోయిందా..?

నవీన్ పొలిశెట్టి.. జాతి రత్నాలు అనే కామెడీ సినిమాతో ఒక్కసారిగా సినీ ప్రేక్షకుల మైండ్ లోకి వచ్చేసారు నవీన్ పోలిశెట్టి.అంతకుముందు ఈయన నటించిన ఏజెంట్ ఆత్రేయ సాయి శ్రీనివాస అనే సినిమా అంతగా హిట్ కొట్ట


Published Aug 06, 2024 03:48:02 PM
postImages/2024-08-06/1722939482_naveenpolishettymarraige.jpg

న్యూస్ లైన్ డెస్క్: నవీన్ పొలిశెట్టి.. జాతి రత్నాలు అనే కామెడీ సినిమాతో ఒక్కసారిగా సినీ ప్రేక్షకుల మైండ్ లోకి వచ్చేసారు నవీన్ పోలిశెట్టి.అంతకుముందు ఈయన నటించిన ఏజెంట్ ఆత్రేయ సాయి శ్రీనివాస అనే సినిమా అంతగా హిట్ కొట్టానప్పటికి జాతి రత్నాలు మూవీ మాత్రం నవీన్ పోలిశెట్టికి మంచి ఇమేజ్ తీసుకొచ్చి పెట్టింది.ఆ తర్వాత గత ఏడాది వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా కూడా బాగానే వర్కౌట్ అయింది.అయితే అలాంటి ఈ హీరో తాజాగా పెళ్లి చేసుకున్నట్టు సోషల్ మీడియాలో ఊహగణాలు వినిపిస్తున్నాయి.

అయితే గత కొద్దిరోజుల నుండి నవీన్ పోలిశెట్టి ఇండియాలో ఉండడం లేదు. ఆయన పూర్తిగా అమెరికాలోనే ఉంటున్నారు. ఇక రీసెంట్గా ఫిలింఫేర్ అవార్డ్స్ సమయంలో ఆయన ఇండియాకి వచ్చారు.మళ్ళీ అమెరికాకే వెళ్లిపోయారని కొంతమంది భావిస్తున్నారు. అయితే అమెరికాలో ఆయన ఓ అమ్మాయిని పెళ్లాడారని,అందుకే టైం దొరికితే అక్కడికి వెళ్తున్నారని,ఇక తన పెళ్లి గురించి బయట పెట్టకుండా మరికొద్ది రోజులు సినిమాల్లో రాణించాక సడన్గా ఈ విషయాన్ని బయటపెట్టి అందరిని సర్ప్రైజ్ చేద్దామని నవీన్ పోలిశెట్టి చూస్తున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి.

అయితే ఈ విషయంపై నవీన్ పోలిశెట్టిని అడగగా..అలాంటిదేమీ లేదు.అది పూర్తిగా పుకారే అని కొట్టి పారేశారు. అంతేకాదు నేను పెళ్లి చేసుకుంటే మీడియా వాళ్లకు ఆ విషయాన్ని ముందుగా తెలియజేస్తాను. ప్రస్తుతం నా చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. వాటి గురించి ఆలోచన చేస్తున్నాను. నేను పెళ్లి చేసుకున్నాను అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు..అంటూ కొట్టిపారేశారు.

మరి నిప్పు లేనిదే పొగరాదు అన్నట్లు నవీన్ పోలిశెట్టి పెళ్లి చేసుకోకపోతే ఎందుకు పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒకవేళ ఎవరైనా అమ్మాయితో నవీన్ సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ ఏమైనా చేసుకున్నారా అంటూ సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు పెడుతున్నారు

newsline-whatsapp-channel
Tags : newslinetelugu marraige miss-shetty-mister-polishetty naveen-polishetty jati-rathnalu-movie

Related Articles