తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం జోరు మీద ఉన్న హీరోయిన్ ఎవరయ్యా అంటే మొదటిగా గుర్తుకు వచ్చేది జాన్వీకపూర్. బాలీవుడ్ నుంచి తెలుగులోకి వచ్చి వరుసగా సినిమా ఆఫర్లు అందుకుంటుంది.
న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం జోరు మీద ఉన్న హీరోయిన్ ఎవరయ్యా అంటే మొదటిగా గుర్తుకు వచ్చేది జాన్వీకపూర్. బాలీవుడ్ నుంచి తెలుగులోకి వచ్చి వరుసగా సినిమా ఆఫర్లు అందుకుంటుంది. అలాంటి జాన్వికపూర్ తాజాగా పలు ఆసక్తికరమైనటువంటి కామెంట్లు చేసింది.
తాను జీవితంలో మొదటిసారి ఆ పని వల్ల భయపడ్డాను అని తెలియజేసింది. అది తనకు మొదటిసారి అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో దూసుకుపోతున్నటువంటి ఈ అమ్మడు తెలుగులో ఎన్టీఆర్ హీరోగా వస్తున్నటువంటి "దేవర" చిత్రంలో నటిస్తోంది. తెలుగులో Rc 16 తో పాటుగా, నాని హీరోగా చేస్తున్న కొత్త సినిమాల్లో కూడా నటించనుంది.
ఇలా తెలుగు ఇండస్ట్రీలో మరియు బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ క్రేజ్ మీద ఉంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా తాను ఆసుపత్రిలో జాయిన్ అయిన విషయం గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైనటువంటి విషయాలను బయటపెట్టింది.
ఫుడ్ పాయిజన్ వల్ల నేను హాస్పటల్లో చేరానని ఆ సమయంలో తీవ్రంగా భయపడ్డానని, నేను హాస్పిటల్ లో చేరడం మొదటిసారి అని అందుకే తీవ్రంగా భయమేసింది అని చెప్పుకొచ్చింది. ఎవరైనా సరే వారి పని కంటే ముందు ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పింది. ఇప్పుడిప్పుడే తన ఆరోగ్యం కుదుటపడుతోందని, చెప్పుకొచ్చింది ప్రస్తుతం ఆమె అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.