JANVI KAPOOR: జాన్వీ కపూర్‌కే డబ్బులివ్వబోయిన ఫ్యాన్

సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా జాన్వీదే హవా. అయితే రీసెంట్ గా జరిగిన ఓ ఇన్సిడెంట్ జాన్వీ ఫ్యాన్స్ కు భలే అనిపించింది. 


Published Aug 20, 2024 12:12:44 AM
postImages/2024-08-20/1724130610_newproject261724081365.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : ఇప్పుడు టాలీవుడ్ లో జాన్వీ కపూర్ సూపర్ స్టార్. తెలుగు సినిమాలు చెయ్యకపోయినా...శ్రీదేవి వారసత్వం ...ఎన్టీఆర్ తో సినిమా దీంతో అమ్మడు క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అందులోనూ 'దేవర' సినిమా నుంచి చుట్టమల్లే పాట రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా జాన్వీదే హవా. అయితే రీసెంట్ గా జరిగిన ఓ ఇన్సిడెంట్ జాన్వీ ఫ్యాన్స్ కు భలే అనిపించింది. 


ఓ సినిమా షూటింగ్ సెట్లో ఉన్న జాన్వీని చూసేందుకు ఫ్యాన్స్ భారీగా వచ్చారు. వాళ్లని పలకరిస్తూ ...జాన్వీ వెళ్తున్నపుడు తనకు రాఖీ కట్టాలని కోరాడు. దీంతో వెంటనే రాఖీ కట్టింది జాన్వీ . అయితే తనకు డబ్బులు ఇవ్వబోయాడు ..ఈ చర్యకు జాన్వీ కూడా హ్యాపీగా ఫీలయ్యింది. కాని వద్దు ఈ అభిమానం చాలంటూ చెప్పుకొచ్చింది.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. ఎవరితోనైనా రాఖీ కట్టించుకోవచ్చు కానీ నువ్వేందిరా జాన్వీతో కట్టించుకున్నావ్ అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఈ రిపోర్టర్ తెలుగు రాష్ట్రాల్లోను, బాలీవుడ్ లోను ఆల్ ఇండస్ట్రీ బామ్మర్ది అయిపోయాడు. దేవర పాటలో అమ్మడు అందానికి ఫిదా అయిపోయారు. జూ ఎన్టీఆర్-జాన్వీ జోడీగా భలే ఉందంటూ మురిసిపోతున్నారు. మరోవైపు RC 16లో కూడా జాన్వీ కపూర్ నటిస్తుంది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో జాన్వీ పాత్ర బావుంటుందని టాక్. ఇలా ఆర్ఆర్ఆర్‌తో గ్లోబల్ స్టార్స్‌గా మారిన రామ్ చరణ్-ఎన్టీఆర్ లాంటి హీరోలతో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో ఛాన్స్ కొట్టేసింది జాన్వీ కపూర్.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu jr-ntr movie-news janhvi-kapoor

Related Articles