Jr ntr:తండ్రిని తలుచుకుంటూ  ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎమోషనల్ పోస్ట్.!

నందమూరి హరికృష్ణ ఎన్టీఆర్ సంతానంలో ఈయన కూడా ఒకరు.  హరికృష్ణ హీరోగా కూడా ఎన్నో చిత్రాల్లో నటించారు. అలాంటి హరికృష్ణ ఏది మాట్లాడిన ముక్కుసూటిగానే మాట్లాడేవారు. అంతేకాదు ఎన్టీఆర్


Published Sep 02, 2024 01:06:53 PM
postImages/2024-09-02/1725262613_jrntr.jpg

న్యూస్ లైన్ డెస్క్: నందమూరి హరికృష్ణ ఎన్టీఆర్ సంతానంలో ఈయన కూడా ఒకరు.  హరికృష్ణ హీరోగా కూడా ఎన్నో చిత్రాల్లో నటించారు. అలాంటి హరికృష్ణ ఏది మాట్లాడిన ముక్కుసూటిగానే మాట్లాడేవారు. అంతేకాదు ఎన్టీఆర్ పార్టీ స్థాపించడంలో హరికృష్ణ పాత్ర చాలా గొప్పదని చెప్పవచ్చు. అలాగే నందమూరి ఫ్యామిలీలో ఎన్టీఆర్ అంటే అందరూ భయపడతారు కానీ హరికృష్ణ అంటే ఎన్టీఆర్ భయపడేవారు. ఆ విధంగా ఉన్నది ఉన్నట్టుగా నిక్కచ్చిగా చెప్పే గుణం హరికృష్ణది.  అలాంటి హరికృష్ణ కేవలం సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా  మంచి గుర్తింపు సాధించారు. కానీ ఆయన కారు ప్రమాదంలో మరణించారు.

అలాంటి హరికృష్ణ జయంతి సందర్భంగా తన తనయుడు ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. అదేంటో చూద్దాం.. నందమూరి హరికృష్ణ 68వ జయంతి సందర్భంగా ఆయన కుమారులు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు.. ఈ అస్తిత్వం మీరు.. ఈ వ్యక్తిత్వం మీరు..  మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు.. ఆజన్మాంతం తలుచుకునే అశ్రుఖనం మీరే..

https://x.com/tarak9999/status/1830426642139009274

అంటూ ఎన్టీఆర్ ట్విట్ చేశారు.. మీరు ఎప్పుడు మా జ్ఞాపకాల్లోనే ఉంటారు నాన్న అంటూ  కళ్యాణ్ రామ్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. అయితే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో దేవర చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో కూడా ఒక పాన్ ఇండియా సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. అలాంటి ఎన్టీఆర్ ఈ విధంగా ఎమోషనల్ పోస్ట్ అది కాస్త నెట్టింటా విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

newsline-whatsapp-channel
Tags : news-line jr-ntr sr-ntr kalyan-ram harikrishna prashanth-neel

Related Articles