horror movies: పక్కాగా బయపట్టే హార్రర్ మూవీ ..ఓటీటీలోకి !

ఇక దానితో పాటు తెలుగు హర్రర్ థ్రిల్లర్ కళింగ మూవీ కూడా థియేటర్స్ లో పాజిటివ్ టాక్ తో రన్ అవుతుంది. కళింగ థియేటర్ లో కాస్త అటు ఇటుగా ఊగిసలాడుతుంది కాని ఓటీటీలో అయితే పక్కాగా హిట్టవుతుంది.


Published Sep 18, 2024 07:09:16 AM
postImages/2024-09-18/1726656594_sddefault.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఓటీటీ లో ఎప్పుడు ఫస్ట్ ప్లేస్ హార్రర్ సినిమావే అలా థియేటర్స్ లో రిలీజ్ అయితే ఓటీటీలో వెతుకుతూనే ఉంటారు. ఈ క్రమంలో ఈ వారం థియేటర్ లో చెప్పుకునేంత పెద్ద సినిమాలైతే ఏమి లేవు కానీ.. ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉన్న చిన్న సినిమాలైతే రిలీజ్ అయ్యాయి. వాటిలో ప్రస్తుతం సిక్వెల్ సినిమాగా వచ్చిన మత్తువదలరా సినిమాకు మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇక దానితో పాటు తెలుగు హర్రర్ థ్రిల్లర్ కళింగ మూవీ కూడా థియేటర్స్ లో పాజిటివ్ టాక్ తో రన్ అవుతుంది. కళింగ థియేటర్ లో కాస్త అటు ఇటుగా ఊగిసలాడుతుంది కాని ఓటీటీలో అయితే పక్కాగా హిట్టవుతుంది.


ధృవ‌వాయు హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా.. కళింగ. ఈ సినిమాలో ప్ర‌గ్యాన‌య‌న్ హీరోయిన్‌ గా నటించింది. ఇక వీరితో పాటు ముర‌ళీధ‌ర్‌గౌడ్‌, మీసాల ల‌క్ష్మ‌ణ్ కూడా ముఖ్య పాత్రలలో అలరించారు. ప్రస్తుతం ఎలాగూ హర్రర్ సినిమాలకు డిమాండ్ బాగానే ఉంది.ఈ సినిమా స్ట్రీమింగ్ మాటలు జరుగుతున్నాయి. అమేజాన్ ప్రైమ్ వారు ఈ సినిమా డిజటల్ హక్కులు సొంతం చేసుకున్నాయి. ఇంకా సినిమా థియేటర్ లో ఊపందుకోలేదు.  అందుకే డేట్ ఫిక్స్ చెయ్యలేదు. మరో రెండు వారాలు థియేటర్ లో నడిపించి ఓటీటీకి ఇస్తారనే టాక్ ఉంది.


థియేటర్ లో సోసో గా ఉన్నా...ఓటీటీలో మాత్రం పిచ్చ పిచ్చ హిట్ కొడుతుంది. సూపర్ ఉంది సినిమా అయినా ఎందుకో టాక్ రాలేదు. హర్రర్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ.. దానితో పాటు ఓ లవ్ స్టోరీ.. అలాగే డివోషనల్ టచ్ ఇస్తూ.. దర్శకుడు ఈ సినిమా స్టోరీని తెరకెక్కించారు. ఇదొక మల్టీ జోనర్ అని చెప్పి తీరాలి. డైరక్టర్ కు మంచి భవిష్యత్తు ఉంది ..సినిమా మీద మంచి పట్టు కూడా ఉంది. ఓటీటీ డేట్ కోసం వెయిట్ చేద్దాం.

 

newsline-whatsapp-channel
Tags : movie-news horror-movies kalinga-movie

Related Articles