Kalki : కల్కి ఆగమనం అప్పుడేనా.. చెప్పేసిన మేకర్స్


Published Aug 30, 2024 08:10:56 PM
postImages/2024-08-30/1725028856_Kalkimovie.jpg

న్యూస్ లైన్ డెస్క్ : పానిండియా స్టార్ ప్రభాస్, దిశా పటానీ, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ల కాంబోలో నాగ్ అశ్విన్ తెరకెక్కంచి సంచలనం సృష్టించిన మూవీ కల్కి 2898 ఏడీ. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన  ఈ సినిమా వాటిని తలకిందులు చేస్తూ సంచలనాలు సృష్టించింది. తాజాగా ఓటీటీలో రిలీజ్ అయి అక్కడ కూడా దుమ్ము రేపుతోంది. అయితే.. కల్కి మేకర్స్ పార్ట్ 2 గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు.

కల్కి 2898 రిలీజ్ తర్వాత పార్ట్ 2 చాలా వేగంగానే పూర్తయిందని నిర్మాత అశ్వినీదత్ క్లారిటీ ఇచ్చారు. అయితే.. యంగ్ ప్రొడ్యూసర్, అశ్వినీదత్ కూతురు స్వప్నాదత్ మరో అప్డేట్ ఇచ్చారు. కల్కి పార్ట్ 2 వచ్చే ఏడాది స్టార్ట్ అవుతుందని.. 2028లో కల్కి ఆగమనం అని ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఏకంగా సినిమా నిర్మాతనే చెప్పడంతో రెబెల్ స్టార్ ఫ్యాన్స్ 2028 వరకు కల్కి ఆగమనం కోసం ఆగాల్సిందే.

newsline-whatsapp-channel
Tags : prabhas kalki-2898-ad nagashwin kalki-movie tollywood movie-news kalki-2898-ad-sequel latest-news news-updates

Related Articles