KTR Rakhi : కేటీఆర్ కి రాఖీ కట్టిన కవిత.. కేటీఆర్ ఎమోషనల్ పోస్ట్

. ఈ నెల 19న రాఖీ పండుగ సందర్భంగా సోదరితో రాఖీ కట్టించుకోలేక పోయిన కేటీఆర్.. కవిత రాఖీ కట్టగానే సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. రాఖీ ఫీల్ కంప్లీట్ అంటూ ఫేస్ బుక్ లో కేటీఆర్ తన సోదరి కవితతో ఉన్న బంధాన్ని మూడు పదాల్లో రాశారు.


Published Aug 28, 2024 08:19:33 PM
postImages/2024-08-28/1724856573_ktrrakhi.jpg

న్యూస్ లైన్ డెస్క్ : లిక్కర్ పాలసీ కేసులో బెయిల్ పొంది తీహార్ జైలు నుంచి విడుదలైన కవిత.. హైదరాబాద్ నందినగర్ లోని తన నివాసానికి చేరుకున్నారు. జైలు నుంచి విడుదల అయిన వెంటనే అన్న కేటీఆర్ ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని ఎమోషనల్ అయిన కవిత.. ఇంటికి చేరుకున్న అనంతరం ఆయనకు రాఖీ కట్టారు. ఈ నెల 19న రాఖీ పండుగ సందర్భంగా సోదరితో రాఖీ కట్టించుకోలేక పోయిన కేటీఆర్.. కవిత రాఖీ కట్టగానే సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. రాఖీ ఫీల్ కంప్లీట్ అంటూ ఫేస్ బుక్ లో కేటీఆర్ తన సోదరి కవితతో ఉన్న బంధాన్ని మూడు పదాల్లో రాశారు.లిక్కర్ పాలసీ కేసులో ఈడీ సోదాలు చేసినప్పటి నుంచి కవితను అరెస్ట్ చేసినప్పటి వరకు.. ఆ తర్వాత తరచూ కేటీఆర్ తీహార్ జైలుకు వెళ్లి చెల్లికి ధైర్యం చెప్పారు. సుప్రీంకోర్టులో బెయిల్ విచారణ సందర్భంగా కూడా అన్నీ తానై నడిచి కవితను ఇంటికి తీసుకొచ్చారు. .

newsline-whatsapp-channel
Tags : telangana ts-news ktr mlc-kavitha rakhifestival kavitha

Related Articles