pakistan: పాకిస్థాన్ లాహోర్ లో పేలుళ్లు ..పరుగులు తీసిన ప్రజలు !

భారత్ ఆర్మీ దెబ్బకు పాకిస్థాతన్ లో హైఅలర్ట్ ప్రకటించింది. గురువారం సైతం దేశంలో లాహోర్ లో వరుస పేలుళ్లు సంభవించాయి


Published May 08, 2025 12:49:00 PM
postImages/2025-05-08/1746688858_BlastinLahoreFearsofEscalationAfterIndianOperation.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : " ఆపరేషన్ సిందూర్ " సక్సస్ లో ఉన్నారు భారతీయులు . పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ ..పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. తొమ్మిది ప్రాంతాల్లోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది. దాదాపు 80 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారు. భారత్ ఆర్మీ దెబ్బకు పాకిస్థాతన్ లో హైఅలర్ట్ ప్రకటించింది. గురువారం సైతం దేశంలో లాహోర్ లో వరుస పేలుళ్లు సంభవించాయి. దీంతో స్థానిక ప్రజలు భయంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.


లాహోర్ లోని వాల్టన్ ఎయిర్ పోర్టు  సమీపంలోని గోపాల్ నగర్, నసీరాబాద్ ఏరియాల్లో ఒక్కసారిగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. పేలుళ్ల తర్వాత సైరన్లు మోగడంతో స్థానిక ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటన తో కరాచీ , లాహోర్ , సియాల్ కోట్ ఎయిర్ పోర్ట్ లో విమాన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.


భారీ శబ్దాలు రావడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీసిన దృశ్యాలు, స్థానికంగా పొగలు కమ్ముకున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఈ పేలుళ్లు జరగిన ప్రాంతాలకు దగ్గర్లోనే పాకిస్థాన్ ఆర్మీ కంటోన్మెంట్ కూడా ఉంది. ఐదు నుంచి ఆరు అడుగుల డ్రోన్ కూలిపోవడం వల్లే ీ పేలుళ్లు జరిగాయని స్థానిక అధికారులు తెలిపారు. భారత్ ఆర్మీ జరిపిన వైమానిక దాడుల మరుసటి రోజే ఈ ఘటన చోటు చేసుకోవటంతో స్థానిక ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu blast pakistan operation-sindhoor

Related Articles