మాల్ న్యూట్రిషియన్ అంటే పౌష్టికాహార లోపం. ఇంకా చెప్పాలంటే శరీరానికి తగినంత పోషకాలు అందనపుడు ఈ వ్యాధి వస్తుంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మాల్ న్యూట్రిషియన్ అంటే పౌష్టికాహార లోపం. ఇంకా చెప్పాలంటే శరీరానికి తగినంత పోషకాలు అందనపుడు ఈ వ్యాధి వస్తుంది. పోషకాలు అందకపోవడమే కాదు ..శరీరంలో తప్పుడు యాసిడ్స్ , న్యూట్రియెంట్స్ ఏవైనా తప్పుగా అందుతున్నపుడు కూడా ఈ పౌష్టికాహార లోపం జరుగుతుంది. పోషకాహార లోపం యొక్క కారణాలు, లక్షణాలు, రోగ నిర్ధారణ గురించి తెలుసుకుందాం.
పౌష్టికాహార లోపం త్వరగా చిన్నారుల్లో కనిపించినా...60 యేళ్లు పైబడిన వారికి కూడా ఈ సమస్య రావచ్చు. కాని తక్కువ మందిలో కనిపిస్తుంది. పేదరికం, సరైన పోషకాహారం అందుబాటులో లేకపోవడం మరియు కొన్ని వైద్య పరిస్థితులు వంటి అనేక కారణాల ఆధారంగా పోషకాహార లోపానికి కారణాలు మారవచ్చు.
ఎక్కువ కాలం ఆకలితో ఉండడం, స్వఛ్ఛమైన నీరు లేకపోవడం లేదా ...శుభ్రమైన పరిసరాల్లో జీవించలేకపోవడం వల్ల మొదటి స్టేజ్ లో ఈ పోషకాహార లోపం జరుగుతుంది. కాని ఈ వ్యాధి ముదిరి అంటువ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. క్రోన్'స్ వ్యాధి , ఉదరకుహర వ్యాధి మరియు ఇన్ఫ్లమేటరీ ప్రేగు సిండ్రోమ్ (IBS). టీబీ కూడా ప్రమాదకర స్థాయికి చేర్చుకోవచ్చు.
బరువు తగ్గడం: పోషకాహార లోపం యొక్క ప్రారంభ సంకేతాలలో ఒకటి బరువు తగ్గడం , ఎందుకంటే శరీరానికి సరిపోని పోషకాలను భర్తీ చేయడానికి దాని స్వంత కొవ్వు నిల్వలను ఉపయోగిస్తుంది. పోషకాహార లోపం పెరుగుతున్న కొద్ది మజిల్ పవర్ తగ్గుతుంది. అంతేకాదు వీటితో పాటు వీక్ అవ్వడం మొదలవుతుంది.
అదనంగా, పోషకాహార లోపంతో బాధపడేవారిలో పొడిబారడం మరియు స్కేలింగ్ వంటి చర్మ మార్పులు సర్వసాధారణం. చర్మం పొడిబారి ...పొరపొరలుగా మారుతుంది. ఇది కూడా చాలా డేంజర్ కండిషన్..వీరికి డీహైడ్రేషన్ తో పాటు మాల్ న్యూట్రిషియన్ కూడా ఉంటుంది.
ఫైబర్ తీసుకోవడం లేకపోవడం మలబద్ధకానికి దారితీస్తుంది. కలుషితమైన ఆహారం మరియు నీరు తీసుకోవడం వలన కలరా మరియు విరేచనాలు వంటి ఇన్ఫెక్షన్ల కారణంగా అతిసారం ఏర్పడుతుంది.
ఆహారం దొరకక...సరైన సదుపాయాలు లేక నిద్ర , తిండి , ఆరోగ్యమైన ఆహారం , పోషకాలు లాంటివి లేనివాళ్లు కొంతమందైతే ..డైటింగ్ , గ్లామర్ లాంటి వాటి కోసం ప్రాణాల మీదకి తెచ్చుకునే వారు కొందరు. కాని కారణం ఏదైనా పోషకాహార లోపం చాలా ప్రమాదకరం.