Suhani Kalita: మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా..ఇప్పుడు చూస్తే పరేషానే.?

అప్పట్లో ఇండస్ట్రీలో సూపర్ హిట్ కొట్టిన మూవీ  మనసంతా నువ్వే. చక్కని ప్రేమకావ్యంతో  వచ్చినటువంటి ఈ చిత్రం  అద్భుతమైన హిట్ సాధించింది. అలాంటి ఈ సినిమాలో హీరోగా ఉదయ్ కిరణ్ హీరోయిన్ గా రీమాసేన్ చేశారు


Published Sep 06, 2024 12:26:00 PM
postImages/2024-09-06/1725602165_manasanthanuvvemoviechildartist.jpg

న్యూస్ లైన్ డెస్క్: అప్పట్లో ఇండస్ట్రీలో సూపర్ హిట్ కొట్టిన మూవీ  మనసంతా నువ్వే. చక్కని ప్రేమకావ్యంతో  వచ్చినటువంటి ఈ చిత్రం  అద్భుతమైన హిట్ సాధించింది. అలాంటి ఈ సినిమాలో హీరోగా ఉదయ్ కిరణ్ హీరోయిన్ గా రీమాసేన్ చేశారు. అయితే ఈ మూవీకి వియన్ ఆదిత్య డైరెక్షన్ వహించారు. 2001లో రిలీజ్ అయినటువంటి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలమైన విజయాన్ని అందుకుంది.  

ఈ సినిమా కథపరంగానే కాకుండా మ్యూజికల్ పరంగా కూడా భారీ హిట్ అయిందని చెప్పవచ్చు.  ఒక అందమైన ప్రేమకథాచితంగా వచ్చినటువంటి ఈ మూవీకి ఆర్పి పట్నాయక్ సంగీతం అందించారు. ఇందులో తూనీగా తూనీగా సాంగ్  ప్రతి ఒక్కరికి గుండెను తాకింది. అయితే ఈ పాటలో రీమాసేన్ చిన్నపడి పాత్రలో చేసిన అమ్మాయి అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం అమ్మాయి పెద్దలైపోయింది. ఆమె ఎవరు ఆ వివరాలు ఏంటో చూద్దాం.

రీమాసేన్ చిన్ననాటి పాత్ర చేసిన అమ్మాయి పేరు సుహానికలిత. ఈమె బాలనటిగా తెలుగులోనే కాకుండా బెంగాలీ, మలయాళం, హిందీ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించింది.  అలాంటి ఈ ముద్దుగుమ్మ  ప్రస్తుతం పూర్తిగా మారిపోయింది. చదువులు పూర్తి చేసుకొని వచ్చి మళ్ళీ కెరియర్ పై దృష్టి పెట్టి స్నేహగీతం, శ్రీశైలం అనే చిత్రాల్లో నటించింది..

ఈమె సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అవ్వడంతో   ఇండస్ట్రీకి గుడ్ బాయ్ చెప్పి కొత్తగా పెళ్లి చేసుకుని వివాహ జీవితంలోకి అడుగుపెట్టింది.  ప్రస్తుతం ఆమె ప్రొఫెషనల్ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ గా పని చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఫోటోలు సోషల్ మీడియా వైరల్ అవ్వడంతో మనసంతా నువ్వే సినిమా లో చిన్నప్పటి పాత్ర చేసిన ఈమె ఇలా మారిందా అంటూ నెటిజన్లు షాక్ అయిపోతున్నారు.

https://www.instagram.com/p/C7RkPYBP3G7/?igsh=MTlkM3RpODZhb3NxNg==

 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu uday-kiran reema-sen manasantha-nuvve-movie suhani-kalita

Related Articles