Prabhas: ప్రభాస్‍ను హాట్‍స్పాట్ అడిగిన సత్య.. మత్తువదలరా2 ట్రైలర్ రిలీజ్

మత్తు వదలరా 2 ట్రైలర్ ను రెబల్ స్టార్ ప్రభాస్ తో లాంచ్ చేయించారు మూవీ టీం. ప్రభాస్ తో ట్రైలర్ లాంచ్ ను చాలా ఫన్నీ గా రిలీజ్ చేయించారు.


Published Sep 08, 2024 08:47:00 PM
postImages/2024-09-08/1725808930_Screenshot20240908205147.png

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మత్తు వదలరా 2 ట్రైలర్ ను రెబల్ స్టార్ ప్రభాస్ తో లాంచ్ చేయించారు మూవీ టీం. ప్రభాస్ తో ట్రైలర్ లాంచ్ ను చాలా ఫన్నీ గా రిలీజ్ చేయించారు. శ్రీసింహ, సత్య ప్రధాన పాత్రలు పోషించిన మత్తువదలరా 2 చిత్రంపై మంచి హైప్ ఉంది. పార్ట్ వన్ చితక్కొట్టేసింది. 2019లో వచ్చి సూపర్ హిట్ అయిన ‘మత్తువదలరా’కు సీక్వెల్‍గా ఈ చిత్రం వస్తోంది. ఈ సినిమాకు రితేశ్ రాణా దర్శకత్వం వహించారు. 


“స్టార్ అంటే రెబలేరా.. రెబల్ అంటే రాజేరా” అంటూ మత్తువదలరా 2 టీమ్ కేకలు పెడుతుంటే.. సింపుల్ వాక్ తో ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్. ఏం సింహా ఇలా వచ్చావ్ అనగానే సత్య ప్రభాస్ ను ముట్టుకున్నానంటు డ్యాన్స్ చేస్తాడు..వీడిని బయటకు పంపేయండి అంటూ అరుస్తాడు ప్రభాస్. సింహాను ఏంటి ఇలా వచ్చారని ప్రభాస్ అంటే.. ట్రైలర్ లంచ్ అని సత్య అన్నారు. లంచ్ ఏంటి డిన్నర్ చేద్దామని ప్రభాస్ చెప్పారు. అది లంచ్ కాదు రా ..ట్రైలర్ లాంచ్ అన్న చెబితే ప్రభాస్ ఓ లాంచ్ కొచ్చిన గొడవా అంటూ నవ్వుకుంటాడు.


ట్రైలర్‌ను ప్రభాస్‍కు చూపించేందుకు శ్రీసింహ, సత్య పోటీపడతారు. లాపీ ఓపెన్ చేసి ట్రైలర్ చూపిద్దామనుకుంటే డేటా ఉండదు.బఫర్ అవుతూనే ఉంటుంది. అప్పుడు సత్య ప్రభాస్ నే డేటా లేదు ..హాట్ స్పాట్ ఆన్ చేస్తారా అని అడుగుతాడు. ప్రభాస్ లుక్ కి సత్య సైలెంట్ అయిపోతాడు. బఫర్ అవుతూనే ఉంటుంది. దీనితో ..ఈ యాల్టీకి ఇది అవుతుందా అంటాడు.ఫరియా అబ్దుల్లా తాను పాట పాడి టైం పాస్ చేస్తానంటుంది . “దీంతో ఈవిడ ఏంట్రా ఇంతుంది” అని ప్రభాస్ అన్నారు. ఫన్నీ డైలగ్స్ మధ్య ట్రైలర్ ఎవ్వరి దగ్గర ఉండదు ...ప్రభాస్ తన దగ్గర ఉందని చెబుతారు. ఎలా అని అడిగితే తస్కరించా అనే డైలాగ్ చెబుతాడు.


శ్రీసింహ, సత్య మరోసారి మ్యాజిక్ చేసేశారు. ఈ చిత్రంలో ఫారియా అబ్దుల్లా, సునీల్ కూడా మెయిన్ రోల్స్ చేశారు. మత్తువదలరా 2 చిత్రానికి కాలభైరవ సంగీతం అందించారు.ఈ సినిమా 2 గంటల 19 నిమిషాల రన్ టైంతో నడుస్తుంది. ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్టు. మరి సెకండ్ పార్ట్ ఎలా ఉందో చూడాలి.

 

newsline-whatsapp-channel
Tags : prabhas newslinetelugu movie-news srisimha

Related Articles