Bonalu Song: బోనాల జాతర పాట ఆవిష్కరణ

సచివాలయంలోని మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యాలయంలో సుపధ క్రియేషన్స్ రూపొందించిన బోనాల జాతర పాట - 2024 ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.


Published Jul 11, 2024 09:56:01 PM
postImages/2024-07-11//1720715161_poopj.PNG

న్యూస్ లైన్ డెస్క్: సచివాలయంలోని మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యాలయంలో సుపధ క్రియేషన్స్ రూపొందించిన బోనాల జాతర పాట - 2024 ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా టూరిజం & సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. బోనాల పాట - 2024 పోస్టర్ ను & పాటను మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. అనంతరం స్క్రీన్ ద్వారా పాటను వీక్షించి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపంగా బోనాల పాటను రూపొందించారని సుపధ క్రియేషన్స్ బృందానికి మంత్రులు అభినందనలు తెలిపారు. ఈ పాటకు సహకరించిన వివిధ రంగాల కళాకారులకు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సాంస్కృతిక శాఖ సెక్రటరీ వాణి ప్రసాద్ ఐఏఎస్ , దేవాదాయ శాఖ సెక్రటరీ హన్మంతరావు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరిక్రిష్ణ, కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నేత వెలిచాల రాజేందర్ రావు, పొన్నం రవిచంద్ర , ఏ.చందర్ తదితరులు పాల్గొన్నారు.

పాట వివరాలు: 

పాటకి సంగీతం - ఎం ఎం శ్రీలేఖ
లిరిక్స్ - తంగెళ్ళ శ్రీదేవి రెడ్డి
సింగర్ - కీర్తన శర్మ
నృత్యం - నాగ దుర్గ
దర్శకత్వం - చేతన్ కత్తి
డిఓపి -  తిరుగౌని
ఎడిటింగ్ - ఉదయ్ కుంభం

newsline-whatsapp-channel
Tags : telangana minister ponnam-prabhakar bonalu

Related Articles