Mokshagna: మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ పోస్టర్ రిలీజ్.!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ అంటే  ఎలాంటి క్రేజ్ ఉంటుందో మనందరికీ తెలుసు. ఈ ఫ్యామిలీ నుంచి అన్న ఎన్టీఆర్   సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అంచలంచలుగా ఎదిగాడు. అంతేకాకుండా ఇండస్ట్రీని 


Published Sep 06, 2024 12:40:46 AM
postImages/2024-09-06/1725601215_mokshagnafirstmovieposter.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ అంటే  ఎలాంటి క్రేజ్ ఉంటుందో మనందరికీ తెలుసు. ఈ ఫ్యామిలీ నుంచి అన్న ఎన్టీఆర్   సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అంచలంచలుగా ఎదిగాడు. అంతేకాకుండా ఇండస్ట్రీని కూడా ఎదిగేలా చేశాడు. అలాంటి ఎన్టీఆర్  నట వారసులుగా ఇండస్ట్రీకి హరికృష్ణ, బాలకృష్ణ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.

ఇందులో హరికృష్ణ ఓ మోస్తారుగా  సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్న బాలకృష్ణ మాత్రం స్టార్ హీరో అయ్యారు. తర్వాత వచ్చిన వారిలో  జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. తారకరత్న మధ్యలోనే డ్రాప్ అయిపోయి చివరికి ప్రాణాలే కోల్పోయాడు. ఇక కళ్యాణ్ రామ్ ఇప్పటికీ స్టార్డం కోసం ట్రై చేస్తూనే ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ అయితే తన తాత లాగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.

ఇదే తరుణంలో ఈ తరం నుంచే బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారని గత కొంతకాలం నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను నిజం చేస్తూ తాజాగా ఒక పోస్టర్ రిలీజ్ అయింది. హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మైథాలజికల్ యాక్షన్ ఎంటైన్మెంట్  మోక్షజ్ఞ నటించబోతున్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా ఆ లుక్ చూపిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. త్వరలోనే సినిమా టైటిల్ అప్డేట్స్ వెల్లడిస్తామని అన్నారు.  ప్రస్తుతం ఈ లుక్ చూసి అచ్చం అన్న ఎన్టీఆర్ లాగానే ఉన్నాడు అంటూ  నందమూరి అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

https://instagram.fhyd1-5.fna.fbcdn.net/v/t51.29350-15/457618298_727173366219871_4627361014340171333_n.jpg?stp=dst-jpg_e35_p640x640_sh0.08&efg=eyJ2ZW5jb2RlX3RhZyI6ImltYWdlX3VybGdlbi4xMTc5eDIwOTYuc2RyLmYyOTM1MC5kZWZhdWx0X2ltYWdlIn0&_nc_ht=instagram.fhyd1-5.fna.fbcdn.net&_nc_cat=107&_nc_ohc=DtnbK_d7oHQQ7kNvgFFTJ4m&edm=AJYBtmQBAAAA&ccb=7-5&ig_cache_key=MzQ1MDg5ODg4NzYxODIzNzI3Mw%3D%3D.3-ccb7-5&oh=00_AYBrk5_tw897HLmS-XnnuW06rG79WBeaC6Q5mrTpA6aMRQ&oe=66E083C6&_nc_sid=691684

newsline-whatsapp-channel
Tags : newslinetelugu balakrishna mokshagna prashanth-varma nandamuri-family mokshagna-movie-poster

Related Articles