Mr Bachchan: మిస్టర్ బచ్చన్ డే 1కలెక్షన్స్..ఎలా ఉన్నాయంటే.?

గ్రేట్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో  మాస్ మహారాజా రవితేజ హీరోగా  వచ్చినటువంటి మూవీ మిస్టర్ బచ్చన్. ఆగస్టు 15వ తేదీన  ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి అలాంటి ఈ చిత్రం


Published Aug 16, 2024 04:33:06 AM
postImages/2024-08-16/1723783292_raviteja.jpg

న్యూస్ లైన్ డెస్క్: గ్రేట్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో  మాస్ మహారాజా రవితేజ హీరోగా  వచ్చినటువంటి మూవీ మిస్టర్ బచ్చన్. ఆగస్టు 15వ తేదీన  ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి అలాంటి ఈ చిత్రం మిక్స్డ్ టాక్స్ సొంతం సొంతం చేసుకుంది. ఈ మూవీ మొదటి రోజు  ఓపెనింగ్స్ ఎలా ప్రారంభించింది.. ఆగస్టు 15 రోజున  మిస్టర్ బచ్చన్, రామ్ హీరోగా వచ్చినటువంటి డబల్ ఇస్మార్ట్ , విక్రమ్ హీరోగా వచ్చిన తంగలాన్ మూవీస్ కూడా రిలీజ్ అయింది.

ఈ రెండు మూవీస్ ను తట్టుకొని మిస్టర్ బచ్చన్ మొదటిరోజు ఎంత కలెక్షన్స్ రాబట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం.. మిస్టర్ బచ్చన్ మూవీ మాస్ ఎలివేషన్స్, కంటెంట్ విషయంలో బాగున్నా కానీ  ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అవ్వలేదు అనిపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో  దుమ్ము లేపినటువంటి ఈ చిత్రం,  మొదటిరోజు ఓపెనింగ్స్ సొంతగా రాబట్టలేదనిపిస్తోంది.

ట్రేడ్ వర్గాల నుంచి అందిన లెక్కల ప్రకారం ఫస్ట్ డే మిస్టర్ బచ్చన్  మూడు కోట్ల నుంచి 3.5 కోట్ల వరకు షేర్ రాబట్టినట్టు సమాచారం. ఇక ప్రీమియర్ డే వన్ కలెక్షన్స్ అన్నింటినీ కలిపితే  4.8 నుంచి అయిదు కోట్ల వరకు షేర్ కొలగొట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నారు.  రవితేజ లాంటి స్టార్ హీరోలకు ఈ విధమైన కలెక్షన్స్ రావడం దారుణం. దీన్ని బట్టి చూస్తే మాత్రం  తంగలాన్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలు ఎఫెక్ట్ చూపించాయని  చెప్పవచ్చు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu raviteja harish-shankar collections mr-bachchan bagyasri-boorse

Related Articles