mrunal: టాలీవుడ్ సీత బర్త్ డే స్పెషల్

సీతారామం' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న మృణాల్ తెలుగు లో సినిమాలు చేస్తూనే ఉన్నారు. మృణాల్ 32వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. 


Published Aug 01, 2024 05:57:38 AM
postImages/2024-08-01/1722509822_mrunal.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బంగారు కళ్లు , చక్కని నవ్వుతో టాలీవుడ్ లో సీత పేరుతో ఫేమ్ లోకి వచ్చేసింది. మృణాల్ ఠాకూర్ . మృణాళ్ ని ఎన్ని సార్లు చూసినా  సీతారామం స్వాగ్ లోనే ఉంటుంది. ఈ రోజు మృణాల్ ఠాకూర్ పుట్టినరోజు . 'సీతారామం' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న మృణాల్ తెలుగు లో సినిమాలు చేస్తూనే ఉన్నారు. మృణాల్ 32వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. 


అయితే మృణాల్ మహారాష్ట్రలోని ధూలేలో ఆగస్టు 1, 1992లో పుట్టింది. టీవీ సీరియల్స్ తో కెరీర్ మొదలు పెట్టిన మృణాల్.. చాలా తక్కువ టైంలోనే సినిమాల్లో తన సత్తా చాటుకుంది. లవ్ సోనియా సినిమా చూస్తే తన నటన ఎంత అధ్భుతంగా ఉంటుందో చూడొచ్చు.2012లో టీవీ సీరియల్స్ ‘ముజ్సే కుచ్ కెహ్తీ’…’యే ఖామోషియాన్’, ‘కుంకుమ్ భాగ్య’ సీరియల్ తో నటనను ప్రారంభించింది. మన తెలుగు వాళ్లకి అయితే క్లియర్ గా కుంకుం భాగ్య సీరియల్ తో కొంతమందికి పరిచయం అయ్యింది.


లవ్ సోనియా కమర్షియల్ హిట్టు కాదు కాని...మృణాల్ కు మాత్రం చాలా మంచి పేరు వచ్చింది. ఒకానొక సమయంలో మృణాల్ చాలా విమర్శలు ఎదుర్కొంది. అసలు సినిమాకు పనికొచ్చే మోహమేనా.. టీవీ సీరియల్ నటి హీరోయిన్ కావడం ఏంటి అనే కామెంట్స్ కూడా వచ్చాయట. కట్ చేస్తే జస్ట్ 10 యేళ్ల గ్యాప్ లో అటు బాలీవుడ్ , ఇటు టాలీవుడ్ లోను మంచి ఫామ్ లో ఉంది.


హిందీలో ‘సూపర్ 30’, బాట్లా హౌస్‌ చిత్రాలు మృణాల్ కు మంచి గుర్తింపు తెచ్చాయి. 2022లో విడుదలైన ఈ చిత్రం మృణాల్ కెరీర్ ను మార్చేసింది . ‘సీతారామం’, ‘హయ్ నాన్న’ చిత్రాలు మృణాల్ కు ఉత్తమ నటిగా SIIMA, ఫిల్మ్ ఫెయిర్ అవార్డులను తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం మృణాల్ కల్కి 2898 AD పార్ట్ 2లో కీలక పాత్రలో నటిస్తోంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ ను మేడం ఇంకా అనౌన్స్ చెయ్యలేదు.. హ్యాపీ బర్త్ డే మృణాల్.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu mrunal-thakur movie-news birthday

Related Articles