Mrunal Thakur: ప్రొడ్యూసర్ తో మృణాల్ గొడవ.. కారణం.?

హనూ రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా చేసిన సీతారామం మూవీలో సీత పాత్రలో నటించి ఓవర్ నైట్ లో స్టార్ అయింది మృణాల్ ఠాకూర్.అయితే ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ రష్మిక కూడా ఈమె నటన ముందు 


Published Jul 31, 2024 11:05:53 PM
postImages/2024-08-01/1722485145_mrunal.jpg

న్యూస్ లైన్ డెస్క్: హనూ రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా చేసిన సీతారామం మూవీలో సీత పాత్రలో నటించి ఓవర్ నైట్ లో స్టార్ అయింది మృణాల్ ఠాకూర్.అయితే ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ రష్మిక కూడా ఈమె నటన ముందు దిగదుడుపే అనేంతగా మెప్పించింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ సీతారామం సినిమా తర్వాత చాలా ఫేమస్ అయ్యింది.ఇక అంతకు ముందు కొన్ని సినిమాల్లో చేసిన కూడా రాని గుర్తింపు ఈ మూవీతో వచ్చేసింది.

అలా మృణాల్ ఠాకూర్ కంటే ఎక్కువగా సీతారామం బ్యూటీ అనే పేరుతోనే ఇండస్ట్రీలో వైరల్ అయింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం నార్త్, సౌత్ సినిమాల్లో చేస్తుంది.అయితే తాజాగా మృణాల్ ఠాకూర్ తన గురించి ఒక విషయాన్ని పంచుకుంది. అదేంటంటే ఆ సినిమా గురించి ఏకంగా నిర్మాతలతోనే గొడవ పెట్టుకుందట. మరి ఎందుకు గొడవ పెట్టుకుంది.ఆ సినిమా ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ మూవీ పూజా మేరీ జాన్ షూటింగ్ పూర్తి చేసుకుని రెండు సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా విడుదల కాలేదు.

అయితే ఈ సినిమా ఈ ఏడాది విడుదల కాబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మృణాలో మాట్లాడుతూ.. నాకు పూజ మేరీ జాన్ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు నా జీవితానికి దగ్గరగా ఉంది అని అనిపించింది.దాంతో ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాను. అయితే ఈ సినిమాలో అన్ని స్క్రీన్ టెస్ట్ లు పూర్తి చేశాక నన్ను తీసేసి మరో హీరోయిన్ ని పెట్టుకున్నారనే టాక్ వినిపించడంతో డైరెక్ట్ గా నిర్మాతల దగ్గరికి వెళ్లి ఎందుకు ఇలా చేశారు.

నా మీద ఎన్నో స్క్రీన్ టెస్ట్ లు చేసి మరో హీరోయిన్ ని ఎలా తీసుకుంటారని గొడవపడ్డాను. ఒక రకంగా ఈ పాత్ర కోసం చాలా ఫైట్ చేశాను. నిర్మాతల దగ్గర ప్రాధేయపడ్డాను కూడా అంటూ మృణాల్ ఠాకూర్ చెప్పుకొచ్చింది. ఈ సినిమా తన లైఫ్ లో బెస్ట్ మూవీ అని చెప్పింది.మరి విడుదలకు సిద్ధంగా ఉన్న పూజా మేరీ జాన్ అనే సినిమా విడుదలయ్యాక ఎలాంటి ఫలితం అందుకుంటుంది..మృణాల్ ఠాకూర్ కి ఎంత గుర్తింపు వస్తుంది అనేది చూడాలి

newsline-whatsapp-channel
Tags : newslinetelugu mrunal-thakur sitharamam dulkar-salman pooja-meri-jaan bollywood-movie

Related Articles