Nagababu: నాగబాబు లవ్ స్టోరీ.. పెళ్లికి ముందే ఆమెతో అలా.?

ఆరడుగుల ఆజనుబాహుడు నటుడు నాగబాబు అంటే  తెలియని వారు ఉండరు. ఈయన ఇండస్ట్రీలో  మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.  అలాంటి నాగబాబు కాస్త కోపోద్రిక్తుడు అని చాలామంది అంటారు. కానీ ఆయనలో కోపం యాంగిల్


Published Oct 02, 2024 10:04:00 AM
postImages/2024-10-02/1727841269_nagababuwife.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఆరడుగుల ఆజనుబాహుడు నటుడు నాగబాబు అంటే  తెలియని వారు ఉండరు. ఈయన ఇండస్ట్రీలో  మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.  అలాంటి నాగబాబు కాస్త కోపోద్రిక్తుడు అని చాలామంది అంటారు. కానీ ఆయనలో కోపం యాంగిల్ కాకుండా లవ్ యాంగిల్ కూడా ఉందట. నాగబాబు పెళ్లికి ముందే ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించారట. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో నాగబాబు చెప్పుకొచ్చారు. కానీ తనది వన్ సైడ్ లవ్ అని అన్నారు. మరి ఆమె ఎవరు ఆ వివరాలు ఏంటో చూద్దాం..

నాగబాబు టీనేజ్ లో ఉన్న సమయం నుంచే  చాలా చిలిపి పనులు చేసేవారట. అమ్మాయిలతో కాస్త చిలిపిగా ప్రవర్తించే వారట. కానీ ఆయనకు ఒక్క అమ్మాయి కూడా పడేది కాదట. అందం లేదా హైట్ లేదా అంటే అవన్నీ ఉన్నాయి  అయినా అమ్మాయిలు ఆయనను పట్టించుకునే వారు కాదట.  తనతో ఉండే ఇతర ఫ్రెండ్స్ కు అందం, హైటు ఇతర ఏ క్వాలిటీ లేకపోయినా వారికి అమ్మాయిలు సెట్ అయ్యేవారట.  దీంతో నాగబాబు ఎంతో అసూయగా ఫీలై, వారు నన్ను పట్టించుకోవడం లేదు వాళ్లకే నష్టం అని అనుకునే వారట.

అలా నాగబాబు టీనేజీలో ట్రై చేయగా చేయగా ఒక అమ్మాయి పడిందట. కానీ ఆమె ఎప్పుడైనా సరే దూరం నుంచి చూస్తూ ఉండేదట. వీరిద్దరూ కళ్ళతోనే మాత్రమే లవ్ చేసుకునేవారట..  అలా కొన్నాళ్లపాటు వీరి లవ్ ట్రాక్ నడిచిందట. ఆ తర్వాత ఆ అమ్మాయి ఫ్యామిలీ ఆ ఊర్లో నుంచి పూర్తిగా వెళ్లిపోవడంతో ఆమె ఎక్కడికి వెళ్లిందో కూడా తెలియలేదట.   టీనేజ్ లో ఉన్నప్పుడు చిన్న లవ్ స్టోరీ ఉన్నదని  ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చినట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

అయితే ఆ అమ్మాయితో నాగబాబు ఒక్కసారి కూడా మాట్లాడలేదట. ప్రధాన కారణం ఆయనకు ఉన్నటువంటి భయం. ఆ టైంలో అమ్మాయిలతో మాట్లాడాలంటే వనికి పోయేవాడినని  అందుకే నా ప్రేమ విషయం ఆమెకు చెప్పలేకపోయానని చెప్పుకొచ్చారట.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.  దీంతో నాగబాబుకు కూడా లవ్ స్టోరీ ఉందా అంటూ మెగా అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : news-line niharika committee-kurrallu-movie nagababu padmaja nagababu-lovestory nagababu-love-failure

Related Articles