Niharika : రెండోపెళ్లికి సిద్ధమవుతున్న నిహారిక.. వరుడు అతడేనా?

నిహారికా పెళ్లి గురించి మళ్లీ ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఇదే విషయమై నిహారిక స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ అప్డేట్ చెప్పింది. మళ్లీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాను అనేది చెప్పలేను కానీ.. నాకు సరిపోయే వ్యక్తి దొరికితే తప్పకుండా పెళ్లికి రెడీ అంటోందీ మెగా బ్యూటీ.


Published Aug 13, 2024 06:24:46 PM
postImages/2024-08-13/1723553686_Niharikakonidela.jpg

న్యూస్ లైన్ డెస్క్ : మెగా బ్రదర్ నాగబాబు కూతురు కొణిదెల నిహారిక నాలుగేళ్ల క్రితం చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకొని విడిపోయిన సంగతి తె లిసిందే. ఆ తర్వాత నిహారిక రకరకాలుగా వార్తల్లో నిలిచింది. పెళ్లి అని.. డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిందని వార్తలొచ్చాయి. అప్పటి నుంచి పూర్తి సమయం సినిమాలకే కేటాయిస్తున్న నిహారికా తాజాగా కమిటీ కుర్రాళ్లు సినిమాతో ప్రొడ్యూసర్ గా మారిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమా మంచి టాక్ తో  సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది.

అయితే.. నిహారికా పెళ్లి గురించి మళ్లీ ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఇదే విషయమై నిహారిక స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ అప్డేట్ చెప్పింది. మళ్లీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాను అనేది చెప్పలేను కానీ.. నాకు సరిపోయే వ్యక్తి దొరికితే తప్పకుండా పెళ్లికి రెడీ అంటోందీ మెగా బ్యూటీ. మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉండే ఓ కుర్రాడిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిపోయిందని ఫిలిం నగర్ టాక్. ఇప్పటికే ఇరు కుటుంబాల పెద్దల మధ్య మాటామంతీ పూర్తయిందని.. ఈ ఏడాది చివర్లో మెగావారింట బాజాలు మోగబోతున్నాయని వార్తలొస్తున్నాయి.

newsline-whatsapp-channel
Tags : pawankalyan chiranjeevi newslinetelugu mega-family movie-news latest-news news-updates niharika committee-kurrallu-movie ramcharan committee-kurrallu-trailer

Related Articles