NAYAN: నయనతారకు ఆ మందారం టీ తోనే తిప్పలా !

రీసెంట్ గా నయనతార మందారపు టీ అంటూ ఒకటి ప్రమోట్ చేస్తుంది. హెల్దీ ..టేస్టీ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.


Published Jul 30, 2024 08:25:09 AM
postImages/2024-07-30/1722345890_actressnayanthara1722248806.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్స్ లో నయన్ కూడా ఒకరు. తెలుసుగా మేడం ఆన్ స్క్రీన్ దుమ్ము దులిపేస్తుంది.తెలుగు, తమిళం సినిమా ఇండస్ట్రీస్ లో తమ సత్తా చాటుతున్నారు. రీసెంట్ గా నయనతార మందారపు టీ అంటూ ఒకటి ప్రమోట్ చేస్తుంది. హెల్దీ ..టేస్టీ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే అది ఇప్పుడు చిక్కులు తెచ్చిపెట్టింది.  దీనిపై ఆ సదరు డాక్టర్ అవన్నీ తప్పని నయన్ పై వ్యంగ్యంగా పోస్ట్ లు పెట్టాడట. దీనితో నయన్ కి చిర్రెత్తుకొచ్చి తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని పోస్ట్ స్టోరీస్ పెట్టింది. మూర్ఖులతో వాదించకుండా కామ్ ఉండడమే మంచిదని ట్వీట్ చేసింది.


అంతేకాదు నయన్ చెప్పిన టీ కోసం తెలుసుకోవాలి అనుకునేవారు ఏ మందారంతో ఆ టీ చేస్తారో భేదాలు తెలుసుకోవాలి అంటూ మరికొన్ని స్టోరీస్ పెట్టింది. అయితే తనకు తెలిసింది చెప్పాను కాని అందరిని ఫాలో అవ్వమని చెప్పలేదనేది నయన్ అభిప్రాయం ..కాని డాక్టర్ మాత్రం ఏం చెప్తున్నారు..నోటికి వచ్చినట్లు చెప్పి జనాల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారంటు ఫైర్ అయ్యాడు. లాస్ట్ టైం సమంత ఇన్ హెలర్ కోసం చెప్పింది చూశారు. అప్పుడు ఓ డాక్టర్ సమంతను తిట్టిపోశారు. ఇప్పుడు ఆ డాక్టర్ నయన్ ను టార్గెట్ చేశారు.


ప్రస్తుతానికి నయన్... ఈ మందారం టీ ..పంచాయితీలో ఉంది. ఇలా సినిమా యాక్టర్లు చెప్పారని పిచ్చిపిచ్చిగా వాడకండి అంటూ డాక్టర్ చెబుతున్నారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nayanthara socialmedia

Related Articles