harsha sai: రోడ్డుపై డబ్బు చల్లుతూ ....యూట్యూబర్ హర్ష పిచ్చి పనులు

యూట్యూబర్ హర్ష సాయి కూడా ఒకరు. పేదలకు సాయం చేస్తూ ..అంతకు మించి గేమింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ సోషల్ మీడియాను తెగ వాడుకుంటున్నారు


Published Aug 23, 2024 09:36:58 AM
postImages/2024-08-23//1724386018_youtuber.jpg.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : ఈ సోషల్ మీడియా  ఇన్ఫులెన్సర్స్ కు పిచ్చి ముదిరిపోయింది. ఫేమ్ గేమ్ కోసం ఏమైనా చేస్తున్నారు. ఏం పిచ్చో ఏమో ఏం చేస్తున్నారో కూడా తెలీడం లేదు. ఫేమస్ అవ్వడానికి ఏం చేసినా పర్లేదంటున్నారు. ప్రాణాలే లెక్క చేయడం లేదు. అటు పేదలకు సాయం చేస్తున్నారు. వాళ్ల ఫేమ్ కోసం దేన్నైనా వాడుకుంటున్నారు. రెండు చేస్తున్నారు. కాని రీసెంట్ హర్ష  అనే యూట్యూబర్ కూకట్ పల్లిలో నానా హంగామా చేశారు. డబ్బును రోడ్లపై జల్లుతూ జనాలు ఎగబడుతుంటే వీడియోలు తీసాడు.


హైదరాబాద్ లో యూట్యూబర్ హర్ష నడిరోడ్డుపై హల్ చల్ చేశాడు. గాల్లో డబ్బులు ఎగరేస్తూ.. రోడ్డుపై స్టంట్స్ చేశాడు. దీనిపై నెటిజన్స్ మండిపడుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే రోడ్డుపై కరెన్సీ నోట్లను విసిరేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఈ డబ్బులు కోసం జనాలు..రోడ్లకు అడ్డంగాపడడం వల్ల అటు ట్రాఫిక్ పోలీసులకు , ఇటు వెహికల్స్ నడిపే వారికి చాలా కష్టమైంది. సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు వ్యూవర్స్ కు రివార్డ్స్ ఆఫర్ చేస్తూ గాల్లో డబ్బులు విసిరి చేసిన పనికి నెటిజన్లకే చాలా ఇరిటేషన్ వచ్చిందట.


రద్దీగా ఉండే రోడ్లపై డబ్బు వెదజల్లడం వల్ల వాటిని పట్టుకునేందుకు జనం ఎగబడతారు. దీని వల్ల ట్రాఫిక్ జామ్, తొక్కిసలాట కూడా జరుగుతుంది. ఈ విధంగా ఇతరులకు ఇబ్బందులు కలిగేలా వ్యవహరించే యూట్యూబర్ హర్షపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇలాంటి వారికి తగిన బుద్ది చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.యాక్సిడెంట్లు లాంటివి అయితే వీటి వల్ల చాలా ప్రజలకు చాలా ఇబ్బంది అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu social-media youtuber

Related Articles