Pushpa2: పుష్ప2 నుంచి న్యూ పోస్టర్ రిలీజ్..ఇక రచ్చ రచ్చే.!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు ఫ్యామిలీ పేరు చెప్పగానే చాలామంది గుర్తుకు వచ్చే హీరో అల్లు అర్జున్. ఆయనకు ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నా కానీ కేవలం నటన టాలెంటును నమ్ముకుని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు


Published Aug 28, 2024 06:57:45 PM
postImages/2024-08-28/1724851665_PUSHPA2POSTER.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు ఫ్యామిలీ పేరు చెప్పగానే చాలామంది గుర్తుకు వచ్చే హీరో అల్లు అర్జున్. ఆయనకు ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నా కానీ కేవలం నటన టాలెంటును నమ్ముకుని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.  అలాంటి అల్లు అర్జున్ పుష్ప సినిమా ద్వారా ఆల్ ఇండియా స్టార్ గా మారాడు.

అలాంటి ఈయన  పుష్ప2 సీక్వెల్లో కూడా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సుకుమార్ చాలా అద్భుతంగా రూపొందించబోతున్నారు.  పుష్ప2 ది రూల్ శరవేగంగా చిత్రీకరణ జరుగుతుంది.  అలాంటి సినిమాకు రిలీజ్ కు సంబంధించి కౌంట్ డౌన్ మొదలైంది. చిత్రాన్ని కేవలం 100 రోజుల్లోనే  రిలీజ్ చేయడానికి సిద్ధమైంది.  డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు రాబోతున్న ఈ సినిమా గురించి తెలియజేస్తూ తాజాగా చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ను  షేర్ చేసింది.

ఈ సందర్భంగా క్యాప్షన్ ఇస్తూ మరో వంద రోజులు అతడి రూల్ చూడనున్నారు అద్భుతమైన అనుభూతిని పొందడానికి సిద్ధం కండి అంటూ పేర్కొన్నది. ఈ పోస్టర్ చూసిన అభిమానులు చాలా ఆనంద పడిపోతున్నారు. అయితే పుష్ప2 మొదటి భాగం కంటే అదిరిపోతుందని సుకుమార్ ఇప్పటికే తెలియజేస్తూ వస్తున్నారు. మొదటి పార్ట్ లో మిగిలిపోయినటువంటి సస్పెన్స్ కు రెండవపార్ట్ లో సమాధానం దొరుకుతుందని ఆయన అన్నారు.

సిండికేట్ తో పుష్పరాజు ఆడే గేమ్స్, ఎమోషనల్ సీన్స్ మరింత ఆకట్టుకుంటాయట. యాక్షన్, డ్రామా ప్రతీ ప్రేక్షకుడిని అలరిస్తుందని దేవి శ్రీ పాడిన పాటలు మరింత ఆకట్టుకుంటాయని తెలియజేస్తున్నాడు. రష్మిక  అందాలు ప్రేక్షకులను ఎంతో మెప్పిస్తాయట. ఇప్పటికి 500 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ మూవీని  డిసెంబర్ 6న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయడానికి సిద్ధమైపోయారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu allu-arjun sukumar pushpa2 rashmika-mandanna

Related Articles