Big Boss Telugu8: బిగ్ బాస్ నుంచి సరికొత్త టీజర్..అదిరిపోలా.?

బిగ్ బాస్ ఎనిమిదవ సీజన్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇంకా కొన్ని వారాల్లోని ఎనిమిదవ సీజన్ కూడా ప్రారంభం అవబోతోందని అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే తరుణంలో సీజన్ 8 కి సంబంధించిన టీజర్


Published Aug 02, 2024 09:20:18 AM
postImages/2024-08-02/1722604979_BiggBoss8Teaser.jpg

న్యూస్ లైన్ డెస్క్: బిగ్ బాస్  తెలుగు సినీ పరిశ్రమలో సరికొత్త  మైలురాయి. ప్రస్తుతం ఉన్నటువంటి టీవీ రియాలిటీ షోలలో  ఈ బిగ్ బాస్ ఎంతో ప్రాచుర్యం పొందింది. ఇప్పటికే 7 సీజన్లు సక్సెస్ఫుల్ గా  కంప్లీట్ చేసుకున్న ఈ షో  త్వరలో 8వ సీజన్ ప్రారంభానికి సిద్ధమైంది. ఏడవ సీజన్ నుంచి బిగ్ బాస్ ని చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు.  

ఏడవ సీజన్లో ఉల్టా పల్టా పేరుతో బిగ్ బాస్ చాలా ఆసక్తికరంగా కొనసాగింది.  చివరికి కామన్ మ్యాన్ గా వచ్చినటువంటి రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచారు. బిగ్ బాస్ ఎనిమిదవ సీజన్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇంకా కొన్ని వారాల్లోని ఎనిమిదవ సీజన్ కూడా ప్రారంభం అవబోతోందని అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే తరుణంలో సీజన్ 8 కి సంబంధించిన టీజర్ తాజాగా విడుదలైంది.

ఈసారి కూడా హోస్టుగా నాగార్జుననే ఉండేటట్టు కనిపిస్తోంది.  అయితే ఈ టీజర్  సరికొత్తగా రూపొందించారు. ఈ టీజర్ లో కమెడియన్ సత్య  పాత్రలో పరిచయమైన  నాగార్జున జీనీ లా కనిపించారు.  వరాలు ఇచ్చే కింగ్ ఒక్కసారి కమిట్ అయితే అంటూ  నాగార్జున డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇన్ఫినిటీ ఆఫ్ వన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం సిద్ధం అవ్వండి.

ఈ సీజన్ అందరిని సరికొత్తగా ఆకట్టుకోనుంది అని చెప్పారు.ఈ విధంగా టీజర్ బయటకు రావడంతో  బిగ్ బాస్ 8 ప్రారంభం ఎప్పుడెప్పుడు అవుతుంది.. ఇందులో ఎవరెవరు కంటెస్టెంట్లు పాల్గొంటున్నారు.. అనేది చాలా ఆసక్తికరంగా మారింది. కొన్ని నిమిషాల్లోనే ఈ టీజర్ లక్షలాది వ్యూస్ ను  అందుకుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nagarjuna big-boss7 star-maa bigg-boss-8 pallavi-prashanth comedian-sathya

Related Articles