కేరళంలో నిఫా వైరస్ కలకలం.. ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త !

కేరళంలోని కోజికోడ్ జిల్లాలో నిఫా వైరస్ (Nipah Virus) కేసు నమోదవడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఫెరోక్ ప్రాంతానికి చెందిన 43 ఏళ్ల వ్యాపారికి జరిపిన ప్రాథమిక పరీక్షల్లో నిఫా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉండటంతో కోజికోడ్ మెడికల్ కాలేజీ ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. 


Published Jun 15, 2026 02:07:07 PM
postImages/2026-06-15/1781512627_HK1Rp7uaUAAM6UD.png

కేరళంలోని కోజికోడ్ జిల్లాలో నిఫా వైరస్ (Nipah Virus) కేసు నమోదవడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఫెరోక్ ప్రాంతానికి చెందిన 43 ఏళ్ల వ్యాపారికి జరిపిన ప్రాథమిక పరీక్షల్లో నిఫా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉండటంతో కోజికోడ్ మెడికల్ కాలేజీ ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. అయితే బాధితుడిని కలిసిన దాదాపు 100 మందికి పైగా వ్యక్తులను అధికారులు గుర్తించి ప్రత్యేక నిఘాలో ఉంచారు. కేరళంలో కేసు నమోదు కావడంతో పొరుగు రాష్ట్రమైన తమిళనాడు అప్రమత్తమైంది. ఊటీ (నీలగిరి), కోయంబత్తూరుతో పాటు 13 అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద 24 గంటలూ పనిచేసే మెడికల్ క్యాంప్‌లను ఏర్పాటు చేసి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. కాగా పరిస్థితి అదుపులోనే ఉందని, ప్రజలు ఎవరూ భయాందోళనలకు గురికావద్దని కేరళ ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. నిఫా వైరస్ లక్షణాలుఈ వైరస్ సోకిన వారిలో సాధారణంగా 4 నుండి 14 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి. తీవ్రమైన జ్వరం. తలనొప్పిదగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిమైకం రావడం, వాంతులు అవ్వడంతీవ్రత ఎక్కువైతే మెదడు వాపు సంభవించి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. పక్షులు (ముఖ్యంగా గబ్బిలాలు) లేదా జంతువులు కొరికిన, కింద పడిన పండ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ తినకూడదు. చేతులను క్రమం తప్పకుండా సబ్బు లేదా శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి. వైరస్ సోకిన వారికి చికిత్స అందించేటప్పుడు లేదా అనుమానిత ప్రాంతాల్లో తిరిగేటప్పుడు మాస్కులు, గ్లోవ్స్ తప్పనిసరిగా ధరించాలి. గబ్బిలాలు ఎక్కువగా ఉండే పాత బావులు, తోటలు, చెట్లకు దూరంగా ఉండటం మంచిది.
 

newsline-whatsapp-channel
Tags : health-news tamilanadu nipah-virus keralam nipah-patients

Related Articles