Telangana: ORR పరిధి గ్రామాలపై సర్కార్ కీలక నోటిఫికేషన్

ఇప్పటి నుంచి పంచాయతీల రికార్డులకు సంబంధించిన పనులను మున్సిపల్ అధికారులు చూసుకోనున్నారు. 


Published Sep 03, 2024 06:16:33 PM
postImages/2024-09-03/1725367593_orrvillages.jpg

న్యూస్ లైన్ డెస్క్: పటాన్‌చెరు నియోజక వర్గ పరిధిలోని ORR పరిధి గ్రామాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ORR పరిధిలోని గ్రామాలను మున్సిపాలిటీలో కలుపుతూ మంగళవారం సర్కార్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ గెజిట్ తక్షణమే అమల్లోకి రానుందని ప్రభుత్వం తెలిపింది. 

కొత్తగా విడుదలైన గెజిట్ ప్రకారం.. ఐలాపూర్, ఐలాపూర్ తండా, కిష్టారెడ్డిపేట, పటేల్ గూడ, దాయర, సుల్తాన్పూర్ గ్రామాలు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోకి రానున్నాయి. పటాన్చెరు మండల పరిధిలోని.. పాటి, కర్ధనూరు, ఘనపూర్, పోచారం, ముత్తంగి గ్రామాలు తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోకి విలీనం కానున్నాయి. ఇప్పటి నుంచి పంచాయతీల రికార్డులకు సంబంధించిన పనులను మున్సిపల్ అధికారులు చూసుకోనున్నారు. 


 

newsline-whatsapp-channel
Tags : india-people ts-news news-line newslinetelugu telanganam congress-government orr government-gazette orr-villages patancheruvu-orr

Related Articles