పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఈయన విపరీతమైనటువంటి పవర్ లో ఉన్నారు. ఆయన పేరులో ఏ విధంగా పవర్ ఉందో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టి పవర్ లో
న్యూస్ లైన్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఈయన విపరీతమైనటువంటి పవర్ లో ఉన్నారు. ఆయన పేరులో ఏ విధంగా పవర్ ఉందో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టి పవర్ లో కొనసాగుతున్నారు. అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో చేస్తున్న సమయంలోనే తన తోటి నటి హీరోయిన్ రేణు దేశాయిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ గుర్తుగా ఆఖీరానందన్ ఆధ్యా జన్మించారు. కొన్నాళ్ళ పాటు కాపురం చేసిన వీరి మధ్య ఏం పుట్టిందో ఏమో విడాకులు తీసుకొని దూరం గా ఉంటున్నారు.
ఇక ఈమెతో విడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ మరో విదేశీ అమ్మాయి అన్నలేజినోవాని పెళ్లి చేసుకున్నారు. కానీ రేణు దేశాయ్ మాత్రం పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటూ తన పిల్లలను పెంచుతూ వచ్చింది. ప్రస్తుతం రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ కాంబోలో పుట్టిన పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. ఇక పవన్ కొడుకు అకిరా మాత్రం చూడటానికి హీరో కటౌవుట్ కు ఏ మాత్రం తక్కువ లేడు. పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో తన కొడుకు అకీరానందన్ లు తన వెంటే తిప్పుకున్నాడు.
తాను ప్రచార సమయంలో కానీ చంద్రబాబుతో ఉన్నప్పుడు కానీ నరేంద్ర మోడీని కలిసినప్పుడు కానీ అకిరాని వెంట వేసుకొని తీసుకెళ్లాడు. ఈ విధంగా ఎన్నికల సమయంలో అఖీరానందన్ లు ఫేమస్ అయ్యేలా చేశాడని చెప్పవచ్చు. అంతేకాకుండా తన ప్రమాణ స్వీకారం సమయంలో కూడా అకిరా మరియు ఆధ్యాలను పవన్ నరేంద్ర మోడీకి ఇంట్రడ్యూస్ చేయడం మనం చూసాం.
అకిరా నందన్ ఆధ్యాలు తన నాన్నతో ఎప్పుడూ గడపాలంటే అప్పుడు వెళ్లి గడుపుతూ ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా కాకినాడ జిల్లాలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తన కూతురు ఆధ్యా కూడా హాజరైంది. ఇదే సందర్భంలో ఇద్దరు కలిసి క్యూట్ సెల్ఫీ తీసుకున్నారు. తండ్రి కూతురు మధ్య ఉన్నటువంటి ఈ బాండింగ్ ను చూసి అభిమానులు ఎంతగానో మురిసిపోతున్నారు. దీనిపై మీ కామెంట్ ఏంటో కూడా చెప్పండి.