Pawan: ఆ పాత్ర చేయడానికి భయపడి పవన్ మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ మూవీ..?

పవన్ కళ్యాణ్ ఓ బ్లాక్ బస్టర్ సినిమాని కేవలం ఆ పాతలో నటించడానికి భయపడి మిస్ చేసుకున్నారట. ఇక ఆ సినిమా ఏంటి.. ఎందుకు మిస్ చేసుకున్నారు అనేది చూస్తే.. పవన్ కళ్యాణ్ మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ మూవీ ఏదో కాదు


Published Aug 01, 2024 10:56:41 AM
postImages/2024-08-01/1722527403_pawan.jpg

న్యూస్ లైన్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ప్రస్తుతం సినిమాల్లో కాదు రాజకీయాల్లో కూడా స్టార్ అయ్యారు.పవన్ కళ్యాణ్ కి సినిమాల్లో ఎలా అయితే ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో రాజకీయాల్లో కూడా అలాగే తన రాజకీయ చతురతతో,మాటలతో ఎంతోమంది కార్యకర్తలను, అభిమానులను సంపాదించుకున్నారు.

అయితే అలాంటి పవన్ కళ్యాణ్ ఓ బ్లాక్ బస్టర్ సినిమాని కేవలం ఆ పాతలో నటించడానికి భయపడి మిస్ చేసుకున్నారట. ఇక ఆ సినిమా ఏంటి.. ఎందుకు మిస్ చేసుకున్నారు అనేది చూస్తే.. పవన్ కళ్యాణ్ మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ మూవీ ఏదో కాదు గజిని.. సూర్య హీరోగా చేసిన గజినీ మూవీ లోని హీరో పాత్ర ముందుగా చాలామంది నటుల దగ్గరికి వెళ్ళింది. కానీ వారందరూ రిజెక్ట్ చేయడంతో అది కాస్తా సూర్య దగ్గరికి వచ్చింది.

అయితే ఈ మూవీ కోసం డైరెక్టర్ మురగదాస్ పవన్ కళ్యాణ్ ని కూడా సంప్రదించారట.కానీ ఈ సినిమాలో గుండు చేసుకొని,మతిమరుపు క్యారెక్టర్ లో హీరో నటించాల్సి ఉంటుంది. కానీ అలా గుండు చేసుకొని,మతిమరుపు పాత్రలో చేస్తే తన అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని భయపడి పవన్ ఈ సినిమాని రిజెక్ట్ చేసారట.అయితే ఈ విషయాన్ని పవన్ ఓ ఇంటర్వ్యూలో చెబుతూ..

తమిళ్ ప్రేక్షకులు తమ హీరో ఎలాంటి పాత్రలో నటించినా కూడా ఒప్పుకుంటారు. కానీ మన తెలుగు ప్రేక్షకులకు మాత్రం హీరో అంటే చాలా స్టైల్ గా.. హ్యాండ్సమ్ గా..నీట్ గా.. కనిపించాలి. అలా అయితేనే సినిమాలు చూస్తారు. అందుకే నేను గజిని సినిమని రిజెక్ట్ చేశాను అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu pawan-kalyan kollywood muragadas suriya gajini-movie

Related Articles