యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ యంగ్ ఏజ్ నుంచి మిడిల్ ఏజ్ కి వచ్చారు. ప్రజెంట్ ఆయనను పాన్ ఇండియా రెబల్ స్టార్ అని పిలుస్తున్నారు. ప్రస్తుతం పాన్ వరల్డ్ హీరోగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నటువంటి ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో దూసుకుపోతున్నారు. తన సినిమా లైఫ్ పరంగా ఎంతో సక్సెస్ అయినటువంటి ప్రభాస్ తన సొంత లైఫ్ లో మాత్రం వెనుకబడిపోతున్నారని చెప్పవచ్చు. చాలామంది హీరోలు ఓ మోస్తరుగా సెట్ అయిన తర్వాత పెళ్లిళ్లు చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు.
న్యూస్ లైన్ డెస్క్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ యంగ్ ఏజ్ నుంచి మిడిల్ ఏజ్ కి వచ్చారు. ప్రజెంట్ ఆయనను పాన్ ఇండియా రెబల్ స్టార్ అని పిలుస్తున్నారు. ప్రస్తుతం పాన్ వరల్డ్ హీరోగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నటువంటి ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో దూసుకుపోతున్నారు. తన సినిమా లైఫ్ పరంగా ఎంతో సక్సెస్ అయినటువంటి ప్రభాస్ తన సొంత లైఫ్ లో మాత్రం వెనుకబడిపోతున్నారని చెప్పవచ్చు. చాలామంది హీరోలు ఓ మోస్తరుగా సెట్ అయిన తర్వాత పెళ్లిళ్లు చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు.
కానీ రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం 44 సంవత్సరాలు దగ్గరికి వచ్చినా కానీ పెళ్లిపై ఆలోచన చేయడం లేదు. వారి కుటుంబ సభ్యులు ఎంత ఒత్తిడి తీసుకువచ్చినా ఆయన పెళ్లి మాత్రం వాయిదా వేస్తూనే వస్తున్నారు. చివరికి తన పెదనాన్న కృష్ణంరాజు ఉన్న సమయంలోనే ప్రభాస్ పెళ్లి ఘనంగా చేయాలని ఆశపడ్డారు. కానీ ప్రభాస్ మాత్రం ఆశను తీర్చలేకపోయాడు. చివరికి తన పెద్దమ్మ శ్యామలాదేవి అయిన తన చేతుల మీదుగా ప్రభాస్ పెళ్లి చేయాలని ఎంతో ఆశపడుతోంది.
అంతేకాకుండా ప్రభాస్ పెళ్లికి సంబంధించినటువంటి షాపింగ్ చేయడానికి కూడా అనేక ఏర్పాటు చేసింది. ఆ వివరాలు ఏంటో చూద్దాం. ప్రభాస్ తాజాగా నటించి రిలీజ్ అయినటువంటి 'కల్కి' మూవీ అద్భుతమైన హిట్ సాధించి వరల్డ్ వైడ్ గా 1100 కోట్లను వసూలు చేసింది. ఈ మూవీ తర్వాత ప్రభాస్ వరుసగా సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్, సలార్ 2, మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్, హను రాఘవపూడి డైరెక్షన్ లో మరో మూవీకి కమిట్ అయ్యారు. ఈ సినిమాలన్నీ పూర్తయ్యేసరికి ఇంకో నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు తప్పక పడుతుంది. అయితే ఐదేళ్ల వరకు ప్రభాస్ 50 సంవత్సరాలు దాటుతాడు కాబట్టి ప్రభాస్ కుటుంబ సభ్యులు పెళ్లిపై విపరీతంగా ఒత్తిడి తెస్తున్నారట. ఇక ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి మాత్రం ఆయన వివాహంపై గట్టి నమ్మకం పెట్టుకుంది. అంతే కాదు ప్రభాస్ పెళ్లిపై చాలాసార్లు కీలక కామెంట్స్ కూడా చేసింది.
అయితే తాజాగా శ్యామలాదేవి హైదరాబాదులో నటుడు కృష్ణుడు భార్య గాయత్రి, అభిలాష రెడ్డి అనే మహిళతో కలిసి హైదరాబాదులో చీరల బిజినెస్ స్టార్ట్ చేశారు. ఈ షాప్ ఓపెనింగ్ కి శ్యామలాదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ షాపులో మంచి శారీస్ ఉన్నాయని, ప్రభాస్ పెళ్లికి కూడా ఈ షాప్ నుంచే, మేము షాపింగ్ చేస్తామని చెప్పారు. అయితే ఆమె మాటలను బట్టి చూస్తే మాత్రం ప్రభాస్ పెళ్లి త్వరలో చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమె మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.