Drugs: డ్రగ్స్ కేసులో హీరోయిన్ సోదరుడు అరెస్ట్

డ్రగ్స్ కేసులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోదరుడుని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-15/1721039766_grugsin.PNG

న్యూస్ లైన్ డెస్క్:  డ్రగ్స్ కేసులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోదరుడుని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ సమీపంలో పోలీసుల భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రూ.2 కోట్ల విలువైన 200 గ్రాముల కొకైన్‌ను నార్కోటిక్, ఎస్‌ఓటీ, రాజేంద్రనగర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. వీటిని తరలిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు డ్రగ్స్ కొనుగోలు  చేస్తున్న మరో ఐదుగుర్ని అరెస్టు చేశారు. అయితే వీరిలో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ఉన్నట్లు సమాచారం. గతంలో రకుల్‌పైన కూడా డ్రగ్స్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. గోవా, ముంబై నుండి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సమాచారంతో నార్కోటిక్ బ్యూరో, ఎస్వోటీ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌ నిర్వహించారు. వీరి నుండి 200 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 2 కోట్లకు పైగా విలువ ఉంటుందని తెలుస్తుంది. ఈ మొత్తాన్ని రకుల్ సోదరుడు వివిధ ప్రాంతాల నుండి తెప్పిస్తున్నట్లు సమాచారం. 

newsline-whatsapp-channel
Tags : telangana police rakul-preet drugs arrest

Related Articles