నటి పూనమ్ కౌర్ కూడా విచ్చేశారు. కళ , కథనం ,భావోద్వోగాల సమ్మేళనంగా ఉన్న ఆ ఆర్ట్ వర్క్ ను సీఎం చంద్రబాబు ఆసక్తిగా తిలకించారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : పూనమ్ కౌర్ సినిమాల కంటే ఎక్కువగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. పవన్ కళ్యాణ్ , డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ లను ఉద్దేశించి గతంలో చాలా పోస్టులు చర్చనీయాంశంగా మారాయి. రీసెంట్ గా పూనమ్ కౌర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలవడం అందరికి షాకింగ్ గా అనిపించింది. హైదరాబాద్‌లో జరిగిన తెలుగు వన్ డిజిటల్ మీడియా సంస్థ వజ్రోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ ఫంక్షన్ కు చాలా మంది సినీ ప్రముఖులతో పాటు నటి పూనమ్ కౌర్ కూడా విచ్చేశారు. కళ , కథనం ,భావోద్వోగాల సమ్మేళనంగా ఉన్న ఆ ఆర్ట్ వర్క్ ను సీఎం చంద్రబాబు ఆసక్తిగా తిలకించారు.
చాలారోజుల తర్వాత ఈ కార్యక్రమంలో కనిపించిన పూనమ్ కౌర్ , కాస్త బొద్దుగా ఏదో అనారోగ్యసమస్యలతో బాధపడుతున్నట్లు కనిపించారు. దీంతో ఆమె ఆరోగ్యంపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు మొదలయ్యాయి. ఈ వార్తల నేపథ్యంలో పూనమ్ కౌర్ తన ఆరోగ్యం గురించి స్పష్టత ఇచ్చారు. తనకు ఫుడ్ ఎలర్జీతో బాధపడుతున్నానని ఆమె తెలిపారు. ఫైబ్రోమయాల్జియా అనే వ్యాధితో తాను ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని పూనమ్ పేర్కొన్నారు. ఈ ప్రాబ్లమ్ కారణంగా శరీరం ఉబ్బినట్లు కనిపిస్తోందని తెలిపారు. ముందుగా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పలువురు నెటిజన్లు ఆమెకు సూచిస్తున్నారు.