NTR: ఎన్టీఆర్ భార్యతో గొడవలు..రిమోట్ గోడకేసికొట్టి వెళ్లిన భార్య.కారణం?

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ నుంచి ఆల్ ఇండియా హీరోగా మారిపోయాడు. అలాంటి ఎన్టీఆర్ ఇండస్ట్రీలో ఇంతటి స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డారు. సినిమాల పరంగా ఆయన  స్టార్డం సంపాదించుకున్న  కానీ సొంత లైఫ్


Published Oct 02, 2024 08:09:04 AM
postImages/2024-10-02/1727836744_ntrlakshmipranati.jpg

న్యూస్ లైన్ డెస్క్: జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ నుంచి ఆల్ ఇండియా హీరోగా మారిపోయాడు. అలాంటి ఎన్టీఆర్ ఇండస్ట్రీలో ఇంతటి స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డారు. సినిమాల పరంగా ఆయన  స్టార్డం సంపాదించుకున్న  కానీ సొంత లైఫ్ లో మాత్రం తన భార్యతో అనేక ఇబ్బందులు పడుతున్నాడట. వారి మధ్య ఒక విషయంలో తరచూ గొడవలు జరుగుతూనే ఉంటాయట. ఇద్దరు ఒక్క దగ్గర ఉంటే టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటారట.

 మరి వీరి మధ్య చిచ్చుపెట్టే మ్యాటర్ ఏంటి ఆ వివరాలు ఏంటో చూద్దాం..ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి అంటే తెలియని వారు ఉండరు. ఈమె ఎన్టీఆర్ తో ఎక్కడికైనా వెకేషన్స్ వెళ్లేటప్పుడు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది తప్ప మీడియాతో ఏనాడు మాట్లాడింది లేదు. ఒక నిండైనా  ఇండియన్ గృహిని ఎలా ఉంటుందో ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి అలా ఉంటుంది. దీంతో చాలామంది ఎన్టీఆర్ భార్య  చాలా డీసెంట్ గా ఉంటుంది ఎన్టీఆర్ ను బాగా చూసుకుంటుంది అనుకుంటారు..

కానీ ఆమె మీరు అనుకున్నంత డీసెంట్ కాదు. ఆమె కోపం వస్తే ఇంట్లో వస్తువులన్నీ పగలాల్సిందే.. ఎన్టీఆర్ ను కోపంతో మడతేట్టేస్తుందట. ఇంతకీ ఆమెకు ఎన్టీఆర్ కు తరచూ ఏసి విషయంలో గొడవలు వస్తాయట. ముఖ్యంగా ఇంట్లో వాడుకునే ఏసి విషయంలో ఇద్దరి మధ్య హెచ్చుతగ్గులు వచ్చి గొడవలు జరుగుతూ ఉంటాయట. ఈ టైంలో ఎన్టీఆర్ తను అనుకున్నదే సాగిస్తారట. దీంతో లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్ ను ఏమి అనలేక కోపంతో  ఏసీ రిమోట్లను గోడకేసి కొట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయట.

అలా ఇద్దరి మధ్య ఈ గొడవలు తప్ప ఇంకా ఏ గొడవలు లేవని ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా జీవిస్తారని  ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమా అద్భుతమైన కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. దాదాపు 310 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసిందట. ఈ విధంగా సక్సెస్ అందుకోవడంతో ఎన్టీఆర్ అభిమానులు సంబరపడిపోతున్నారు.

newsline-whatsapp-channel
Tags : news-line jr-ntr devara janhvi-kapoor lakshmi-pranati

Related Articles