RAM CHARAN: మెల్ బోర్న్ లో రామ్ చరణ్ అద్దిరిపోయే లుక్ !

గ్లోబల్ స్టార్‌ రామ్‌ చరణ్‌ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్‌ మెల్‌బోర్న్‌ వేడుకలో సందడి చేశారు. ఈ వేడుకలో రామ్ చరణ్ ఎంట్రీ ..లుక్ అద్దిరిపోయాయి.


Published Aug 16, 2024 11:38:00 PM
postImages/2024-08-16/1723831756_sddefault.jpg


న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్:  గ్లోబల్ స్టార్‌ రామ్‌ చరణ్‌ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్‌ మెల్‌బోర్న్‌ వేడుకలో సందడి చేశారు. ఈ వేడుకలో రామ్ చరణ్ ఎంట్రీ ..లుక్ అద్దిరిపోయాయి. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్‌ చరణ్‌ రేంజ్‌ ఇంటర్నేషనల్‌ స్థాయికి వెళ్లింది. ఇటీవల చెన్నై వేల్స్‌ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ అందుకున్నారు.


ఇప్పుడు ఏకంగా మెల్‌బోర్న్‌లో జరుగనున్న ఇండియన్ ఫిలిం ఫెస్టివల్లో(IFFM) ముఖ్య అతిథిగా వెళ్లడం చాలా గర్వంగా ఉందంటున్నారు రామ్ చరణ్. ఈ సందర్భంగా భార్య, కూతుర క్లింకారతో కలిసి చరణ్‌ మెల్‌బోర్న్ వెళ్లాడు. ఆ ఎంట్రీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.


ఇండియ‌న్ ఆర్ట్స్ అండ్ క‌ల్చ‌ర్ అంబాసిడ‌ర్ చరణ్‌ ఈ అవార్డును తీసుకోబోతుండటం కూడా విశేషం. భారత సినిమా కు చరణ్ సేవలను గుర్తిస్తూ ఈ అవార్డును అందుకుంటున్నారు.  ఈ అవార్డుకు ఎన్నికైన మొద‌టి ఇండియ‌న్ సెల‌బ్రిటీగా చరణ్‌ మర అరుదైన రికార్డును తన ఖాతా వేసుకున్నాడు.  


"భారతీయ సినిమా గొప్పతనాన్ని, వైవిధ్యం అంతర్జాతీయ వేదికపై ప్ర‌ద‌ర్శించ‌డం. ఇండియ‌న్ ఫిలిం ఫెస్టివ‌ల్ ఆఫ్ మెల్‌బోర్న్‌లో ముఖ్య అతిథిగా పాల్గొనడం నాకు దక్కిన అరుదైన గౌరవం ఇదంటు చెప్పుకొచ్చారు రామ్ చరణ్.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu movie-news upasana ramcharan

Related Articles