BREAKING NEWS: రమేష్ రాథోడ్ కన్నుమూత

 ఇప్పటికే ధర్మపురి శ్రీనివాస్ మృతితో రెండు తెలుగు రాష్ట్రాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే మరో కీలక రాజకీయ నాయకుడు తుదిశ్వాస విడిచారు. 


Published Jun 29, 2024 03:02:41 AM
postImages/2024-06-29/1719648067_Untitleddesign35.jpg

న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్ర రాజకీయాల్లో మరో విషాదం చోటుచేసుకుంది. ఇప్పటికే ధర్మపురి శ్రీనివాస్ మృతితో రెండు తెలుగు రాష్ట్రాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే మరో కీలక రాజకీయ నాయకుడు తుదిశ్వాస విడిచారు. 

మాజీ ఎంపీ, బీజేపీ(BJP) నేత రమేష్ రాథోడ్(59)(ramesh rathod) కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను శుక్రవారం  ఆదిలాబాద్(Adilabad) జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్(private hospital)కు తరలించారు. పరీక్షించిన డాక్టర్లు ఆయన పరిస్థితి విషమంగా ఉందని, హైదరాబాద్(Hyderabad)లోని హాస్పిటల్ కు తీసుకెళ్లాలని సూచించారు. శనివారం ఉదయం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే రమేష్ రాథోడ్ కన్నుమూసినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.  

 


 

newsline-whatsapp-channel
Tags : india-people ts-news newslinetelugu telanganam ramesh-rathod adilabad ramesh-rathod-no-more

Related Articles